Begin typing your search above and press return to search.

క్రికెటర్ తో బ్రేకప్.. 9ఏళ్ళుగా ఎవరితో శృం*గారం చేయలేదు

కానీ అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది ఈ కోల్ కతా బ్యూటీ.

By:  Tupaki Desk   |   27 Jun 2024 7:38 AM GMT
క్రికెటర్ తో బ్రేకప్.. 9ఏళ్ళుగా ఎవరితో శృం*గారం చేయలేదు
X

కోల్ కతా బ్యూటీ పాయల్ ఘోష్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఈ అమ్మడు.. పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. మంచు మనోజ్ ప్రయాణం మూవీతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి, మిస్టర్ రాస్కెల్ సహా వివిధ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది పాయల్ ఘోష్.


కానీ అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది ఈ కోల్ కతా బ్యూటీ. ఆ మధ్య క్రికెటర్, తన మాజీ ప్రియుడు ఇర్ఫాన్ పఠాన్ తో డేటింగ్ కు సంబంధించి ఒక సంచలన పోస్ట్ చేసింది. 2011 నుంచి ఐదేళ్ల పాటు ఇర్ఫాన్ తో డేటింగ్ లో ఉన్నట్లు పాయల్ వెల్లడించింది. ఆ తర్వాత అది అక్కడితో ఆగిపోయిందని చెప్పింది. కొందరు ప్రముఖులు తనను ఇష్టపడ్డారని, కానీ తాను మాత్రం ఇర్ఫాన్ ను లవ్ చేసినట్లు తెలిపింది.


ఇప్పుడు మరోసారి సంచలన పోస్టులు పెట్టింది పాయల్. "ఇర్ఫాన్ పఠాన్ తో బ్రేకప్ అయిన తర్వాత తొమ్మిదేళ్లుగా నేను ఎవరితోనూ శృ*గారం చేయలేదు. ఇది నమ్మశక్యంగా లేకున్నా.. అదే నిజం.. ఆ తర్వాత నాతో ఒక వ్యక్తి శృ*గారం చేయడానికి ట్రై చేశారు. కానీ దాని పట్ల ఒక గౌరవం ఉంది. ఎవరితో పడితే వాళ్లతో పాల్గొనలేం. 2016లో ఒకసారి ఇర్ఫాన్ ఇంటికి వెళ్లాను. ఆయన ఫ్యామిలీని కలిసి ముంబైలోనే నా ఇంటికి వచ్చాను" అని చెప్పింది.


"ఆ తర్వాత నన్ను వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయడం లేదని ఇర్ఫాన్ చెప్పారు. అలా ఇద్దరి మధ్య దూరంగా పెరిగింది. కొన్ని రోజుల తర్వాత.. ఆయన సిస్టర్ కాల్ చేసి ఇర్ఫాన్ కు పెళ్లి అవుతున్నట్లు చెప్పింది. మీకు మనసు ఉంటే ఆలోచించండి నా పరిస్థితేంటో.. నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు. అయితే నాకు ఇర్ఫాన్ కన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ప్రేమ ప్రేమే కదా" అని ఎమోషనల్ అయింది పాయల్.


"మా నాన్నకు ఆ మతస్థులు అంటే నచ్చదు. కానీ ఇర్పాన్ కు నేను సపోర్ట్ చేశాను. నాన్న మా రిలేషన్ ను ఇష్టపడకపోయినా నేనెప్పుడూ చీట్ చేయలేదు. చివరకు నాకు ఏం మిగిలింది?.." అని పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం పాయల్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సడెన్ గా ఆమె ఇలా పెట్టడంతో ఏమైందని అంతా అడుగుతున్నారు. మరేం జరిగిందో పాయల్ ఘోష్ కే తెలియాలి.