అమ్మ సూర్యకాంతం గయ్యాలి కాదు అనురాగ దేవత!
అయితే ఆమె పోషించిన పాత్రల్లానే నిజ జీవితంలోనూ ఉంటారు? అని అప్పట్లో చాలా మంది అనుకునేవారు.
By: Tupaki Desk | 4 Aug 2024 6:54 AM GMTగయ్యాళి అత్త ఎవరంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే నటి సూర్యకాంతం. ఆమె తర్వాత ఎంతో మంది నటీనటులొచ్చారు. కానీ ఆమె స్థానాన్ని మాత్రం ఎవరూ రీప్లేస్ చేయలేదు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే ఓ గొప్ప నటిగా నిలిచిపోయారు. ఆమె పాత్రలే ఆ స్థాయికి తీసుకెళ్లాయి. గయ్యాళి అత్తగా.. తల్లిగా..తోటి కోడలిగా..అక్కగా...చెల్లిగా ఎన్నో పాత్రలతో...వైవిథ్యమైన హవభావాలతో సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు.
అయితే ఆమె పోషించిన పాత్రల్లానే నిజ జీవితంలోనూ ఉంటారు? అని అప్పట్లో చాలా మంది అనుకునేవారు. తాజాగా సూర్యకాంతం వ్యక్తిగత జీవితం గురించి ఆమె కుమారుడు అనంత పద్మనా భమూర్తి ఆసక్తికర విషయంలు పంచుకున్నారు. ఆవేంటో ఆయన మాటల్లోనే.. `మా అమ్మ సినిమాల్లో పోషించిన పాత్రలు చూసి బయట కూడా ఆమె గయ్యాళి అని చాలా మంది అనుకునేవారు.
ఆమె పెద్ద కళ్లు...ముఖం..ముఖం చూసి ఈమె చాలా కోపిస్ట్ లా ఉందేంటి? అనుకుంటారు. అలా ఉండటం వల్లే అమ్మకి అవకాశాలు వచ్చి ఉంటాయి. కానీ ఆమె వ్యక్తగతంగా అనురాగ దేవత. సహాయం చేయడంలో ఒక్క అడుగు వెనక్కి వేయదు. తనకి చేతనైనా సహాయం చాలా మందికి ఎన్నోసార్లు చేసింది. నా భార్యని సొంత కుమార్తెగా చూసుకునేది. రోజూ ఇంటికి పని మనిషి వచ్చేది. కానీ వంట మాత్రం తనతో చేయించేది కాదు.
మా అమ్మ స్వయంగా వండి పని మనిషిని కూర్చోబుట్టి వడ్డించేది. అమ్మ చాలా స్ట్రిక్ట్. చదువుకునే సమయంలో చదువు...ఖాళీ సమయంలో ఆటలు ఆడించేది. నాన్న అడ్వకేట్. అలాగని ఆయనెప్పుడు అమ్మకి ఆంక్షలు పెట్టలేదు. అమ్మకి సావిత్రి అంటే ఎంతో ఇష్టం. తనకి చాలా సహాయం చేసింది. అమ్మ చేతిలో దెబ్బలు తిన్న ఒకే ఒక్క హీరోయిన్ జమునగారే. తనెప్పుడు అమ్మకి కుమార్తెగానే నటించేది. గొప్ప నటీమణులంతా ఆమె చేతిలో దెబ్బలు తిన్నవారే` అని అన్నారు