Begin typing your search above and press return to search.

ఐశ్వ‌ర్యారాయ్‌కి సారీ చెప్పిన పాక్ క్రికెట‌ర్

దీంతో మాజీ క్రికెటర్ ర‌జాక్ వెంట‌నే క్షమాపణలు చెప్పాడు. ఈ వ్యాఖ్యపై ఐశ్వర్య రాయ్ ఇంకా స్పందించనప్పటికీ బిగ్ బి ఎక్స్ లో ఒక రహస్య ట్వీట్‌ను షేర్ చేసారు.

By:  Tupaki Desk   |   15 Nov 2023 5:51 PM GMT
ఐశ్వ‌ర్యారాయ్‌కి సారీ చెప్పిన పాక్ క్రికెట‌ర్
X

కోడ‌లు ఐశ్వ‌ర్యారాయ్ ని కించ‌ప‌రుస్తూ కామెంట్ చేసిన క్రికెట‌ర్ అబ్ధుల్ ర‌జాక్ పై బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ క్రిప్టిక్ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. త‌న‌ వ్యాఖ్యలకు ఐశ్వర్యరాయ్‌కి మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ క్షమాపణలు చెప్పిన కొన్ని గంటల తర్వాత అమితాబ్ బచ్చన్ ఒక రహస్య పోస్ట్‌ను పంచుకున్నారు. అబ్దుల్ రజాక్ 2023 ప్రపంచ కప్‌లో ఐశ్వర్య రాయ్ పేరును ప్ర‌స్తావిస్తూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శనపై వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యల‌కు రజాక్‌ను చాలా మంది తిట్టారు. దీంతో మాజీ క్రికెటర్ ర‌జాక్ వెంట‌నే క్షమాపణలు చెప్పాడు. ఈ వ్యాఖ్యపై ఐశ్వర్య రాయ్ ఇంకా స్పందించనప్పటికీ బిగ్ బి ఎక్స్ లో ఒక రహస్య ట్వీట్‌ను షేర్ చేసారు.

ఎక్స్ లో అమితాబ్ బచ్చన్ `చేతులతో న‌మ‌స్కారం పెడుతున్న ఈమోజీ, రెడ్ ఫ్లాగ్ ఎమోజీ`తో ఒక పోస్ట్‌ను షేర్ చేసారు. ఈమోజీల‌తో పాటు, ఒక ప్రింటెడ్ వ‌ర్డ్ కంటే ఇందులో చాలా అర్థం దాగి ఉంది అని అమితాబ్ రాసారు. అయితే ఇది కొంత అస్పష్టంగా ఉంది. మంగళవారం నాడు, విలేకరుల సమావేశంలో రజాక్‌తో ఈ వివాదం ప్రారంభమైంది, ``నా అభిప్రాయం ప్రకారం ఆటగాళ్లను మెరుగుపరచడం అభివృద్ధి చేయడం మా అస‌లైన‌ ఉద్దేశ్యం కాదు. మీరు ఐశ్వర్య (రాయ్)ని వివాహం చేసుకుంటారని మంచి స్వభావం నైతికత గల బిడ్డను కలిగి ఉంటారని మీరు అనుకుంటే అలా ఎన్నటికీ జరగదు. మొదట మీరు మీ ఉద్దేశాలను సరిదిద్దుకోవాలి`` అని వ్యాఖ్యానించాడు. పాక్ ఆట‌గాళ్ల స‌మ‌స్య‌లోకి ఐష్ పేరును అత‌డు లాగాడు.

ఐశ్వర్యరాయ్‌ను అగౌరవపరిచారని పలువురు ఆరోపించడంతో ఈ వ్యాఖ్య పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ కూడా రజాక్ చేసిన వ్యాఖ్యను తప్పుబట్టారు. బుధవారం ఉదయం పాకిస్తాన్ క్రికెటర్ అబ్ధుల్ ర‌జాక్ SAMAA టీవీలో కనిపించాడు. షోలో అతడు ఐశ్వర్యకు క్షమాపణలు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో షేర్ అయింది. ఈ వీడియోలో అత‌డు ఐష్ కి భేష‌రుతుగా సారీ చెప్పాడు. ``నిన్న మేము క్రికెట్ కోచింగ్ ఉద్దేశాల గురించి మాట్లాడుకున్నాము. నాకు టంగ్ స్లిప్ అయింది. పొరపాటున ఐశ్వర్య రాయ్ పేరును ప్ర‌స్థావించాను. నేను ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను. ఎవరి సెంటిమెంట్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం నాకు లేదు`` అని అన్నారు.