Begin typing your search above and press return to search.

ప్రభాస్ తో ఆ పాకిస్థాన్ అమ్మాయి.. ఉన్నట్లా లేనట్లా?

పాకిస్థానీ నటి సజల్ అలీ మరో కీలక పాత్రలో నటించబోతున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

By:  Tupaki Desk   |   21 Aug 2024 3:56 AM GMT
ప్రభాస్ తో ఆ పాకిస్థాన్ అమ్మాయి.. ఉన్నట్లా లేనట్లా?
X

ప్రభాస్ త్వరలో హను రాఘవపూడితో చేయబోయే కొత్త చిత్రంపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఇటీవలే పూజా కార్యక్రమం పూర్తి చేసుకుంది. ఇక త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రం టైటిల్‌ను తాత్కాలికంగా ఫౌజీ గా నిర్ణయించినట్లు సమాచారం. ఇది స్వాతంత్ర్యానికి ముందు, 1940లలో సాగే పీరియాడిక్ వార్ డ్రామాగా ప్రేక్షకులను అలరించనుంది.

ఇక హీరోయిన్ గా నార్త్ బ్యూటీ ఇమాన్వి ప్రధాన పాత్రలో నటించనుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు వీడియోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. అయితే మరో హీరోయిన్ కూడా సినిమాలో కనిపించనున్నట్లు మొదటి నుంచి వినిపిస్తున్న టాక్. ఆమె పాకిస్థాన్ నటి అని కూడా చాలా రకాల కథనాలు వెలువడ్డాయి. కానీ ఆ విషయంలో ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

పాకిస్థానీ నటి సజల్ అలీ మరో కీలక పాత్రలో నటించబోతున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి ప్రకటన రావాల్సి ఉన్నా, అభిమానుల్లో ఈ వార్తలపై ఆసక్తి నెలకొంది. సజల్ అలీ 2017లో విడుదలైన సూపర్ హిట్ సినిమా మామ్ లో శ్రీదేవి కూతురుగా నటించిన విషయం తెలిసిందే.

అయితే చిత్ర లాంచ్ కార్యక్రమంలో సజల్ అలీ పాల్గొనలేదు, ఇది రూమర్లకు మరింత బలాన్నిచ్చింది. అసలు ఆమె ఉన్నట్లా లేనట్లా అనే డౌట్స్ ఎక్కువయ్యాయి. అయితే కచ్చితంగా ఆమె తగ్గ పాత్రను హను రాఘవపూడి డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. కథలో కూడా ఆమె పాకిస్థానీ అమ్మాయిగా కనిపిస్తుందట. ఇది నిజమైతే సజల్ అలీ నటనతోపాటు, ఆమె పునరాగమనానికి ఈ చిత్రం ఎంతో ముఖ్యమైనదిగా కనిపిస్తోంది.

ఇక మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగిపోగా, ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి. సజల్ అలీ రీ-ఎంట్రీపై సినీ పరిశ్రమలో పెద్ద చర్చ జరుగుతుండగా, ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలు రాబోతోన్నాయి. ఇక సినిమాను దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు సమాచారం.