Begin typing your search above and press return to search.

దీపావ‌ళి పార్టీలో క‌ళ్ల‌న్నీ న‌ట‌వార‌సురాలిపైనే!

ఇది దీపావళి సీజన్.. బాలీవుడ్ `రేపు అన్న‌దే లేదు! అన్నట్లు`గా పార్టీలు చేసుకుంటోంది.

By:  Tupaki Desk   |   28 Oct 2024 3:49 AM GMT
దీపావ‌ళి పార్టీలో క‌ళ్ల‌న్నీ న‌ట‌వార‌సురాలిపైనే!
X

ఇది దీపావళి సీజన్.. బాలీవుడ్ `రేపు అన్న‌దే లేదు! అన్నట్లు`గా పార్టీలు చేసుకుంటోంది. ఈ వీకెండ్ లో ఒక‌ సాయంత్రం ఏస్ డిజైనర్లు అబు జానీ -సందీప్ ఖోస్లా ముంబైలో దీపావళి పార్టీని నిర్వహించారు. దీనికి సినీ పరిశ్రమకు చెందిన చాలామంది ప్ర‌ముఖులు హాజరయ్యారు.


సైఫ్ అలీఖాన్- అమృతా సింగ్ ల‌ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్, నటి శ్వేతా తివారీ కుమార్తె అయిన తన ప్రియురాలు పాలక్ తివారీతో కలిసి కనిపించారు. వేడుక ఆద్యంతం క‌ళ్ల‌న్నీ అంద‌మైన పాల‌క్ పైనే. పాల‌క్- ఇబ్ర‌హీం జంట కేంద్ర‌క ఆక‌ర్ష‌ణ‌గా మారింది. అలాగే క్యాజువల్స్‌లో ఉన్న పాలక్ దీపావళి పార్టీలో ఇబ్రహీంను చూస్తూ ఉండిపోయిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఒక వైరల్ వీడియో క్లిప్‌లో ఇబ్రహీం పాలక్ కోసం ఎదురు చూస్తున్నాడు..ఇంత‌లోనే పాల‌క్ అక్క‌డికి చేరుకోగానే కౌగిలింతతో చీర్ చేసారు. ఇబ్రహీం తన స్నేహితురాలిని విజయ్ వర్మ - తమన్నా భాటియాలకు కూడా పరిచయం చేశాడు.

ఈ వేడుక‌కు అనిల్ కపూర్, సునీతా కపూర్, కరణ్ జోహార్, అగస్త్య నందా, వామికా గబ్బి, భూమి పెడ్నేకర్, రిచా చద్దా, అలీ ఫజల్ వంటి పలువురు ఇతర తారలు కూడా హాజరయ్యారు. కరణ్ జోహార్ -అగస్త్య నంద కలిసి అబు జానీ-సందీప్ ఖోస్లాల దీపావళి పార్టీకి వచ్చారు. ఓర్రీ, నటాసా స్టాంకోవిచ్, నీతూ కపూర్ కూడా వేడుకల్లో కనిపించారు.

పాల‌క్ తివారీతో సైఫ్ వార‌సుడు ఇబ్ర‌హీం చాలా కాలంగా స్నేహంగా ఉన్నాడు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ప్రేమాయ‌ణం సాగుతోంద‌ని ప్ర‌చారం ఉంది. కానీ దీనిని ఆ ఇద్ద‌రిలో ఎవ‌రూ క‌న్ఫామ్ చేయ‌లేదు. కానీ వారి సంబంధంపై త‌ల్లిదండ్రులు సంతోషంగా ఉన్నార‌ని మీడియా క‌థ‌నాలు వండి వారుస్తోంది. టీనేజ‌ర్స్ వారి స్నేహాన్ని అనుబంధాన్ని ఆస్వాధిస్తున్నార‌నేది హిందీ మీడియా చెబుతున్న విష‌యం. కానీ భవిష్య‌త్ లో వారి ప్రేమ‌క‌థ ఎటు చేరుకుంటుందో ఇప్పుడే చెప్ప‌లేనిది.