Begin typing your search above and press return to search.

క‌వర్ పేజీపై క‌వ్వించిన తివారీ బ్యూటీ!

బాలీవుడ్ న‌టి శ్వేతా తివారీ వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన పాల‌క్ తివారీ సుప‌రిచిత‌మే.

By:  Tupaki Desk   |   8 July 2024 1:30 PM GMT
క‌వర్ పేజీపై క‌వ్వించిన తివారీ బ్యూటీ!
X

బాలీవుడ్ న‌టి శ్వేతా తివారీ వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన పాల‌క్ తివారీ సుప‌రిచిత‌మే. గ‌తేడాది స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించిన `కిసీకా భాయ్ కిసీకా జాన్` చిత్రంతో ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. `ది సాప్రాన్ చాప్ట‌ర్`...`ది వ‌ర్జిన్ ట్రీ` లాంటి చిత్రాల్లోనూ భాగ‌మైంది. నాలుగేళ్ల క్రిత‌మే లాంచ్ అయినా అమ్మ‌డి కెరీర్ మాత్రం ఇంకా పుంజుకోలేదు. స‌క్సెస్ కోసం ఎదురు చూస్తుంది. మ‌రోవైపు అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో అంతే యాక్టివ్ గా ఉంటుంది.


ఎప్ప‌టిక‌ప్ప‌డు హాట్ ఫోటోల‌తో నెట్టింట ర‌చ్చ చేస్తుంటుంది. యువ‌త మెచ్చే భంగిమ‌ల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. తాజాగా అమ్మ‌డు ఎల్లే ఇండియా క‌వ‌ర్ పేజీ పై చెల‌రేగిన వైనం మ‌రోసారి కుర్రాళ్ల‌కు నిదు లేకుండా చేస్తోంది. త‌డిపొడి అందాల్లో పాల‌క్ వైట్ క‌ల‌ర్ డిజైన‌ర్ ష‌ర్ట్ ధ‌రించి ఇచ్చిన భంగిమ అలాంటింది మ‌రి. మ‌త్తెక్కించే కిల్ల‌ర్ లుక్ లో ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ పిక్ నెట్టింట వైర‌ల్ గా మారింది.


ఈ ఫోటోని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.` కొత్త విష‌యాలు తెలుసుకోవ‌డానికి ఎంతో ప్ర‌య‌త్నిస్తాను. ఏదైనా నా దృష్టిని ఆకర్షించినప్పుడు దాన్ని ఎలాగైనా పోందాల‌నుకుంటున్నాను. అందుకోసం చాలా సీరియ‌స్ గా ప‌నిచేస్తాను. డ్రెస్ ల విష‌యానికి వ‌స్తే నాకు ఎంత న‌చ్చిన‌దైనా అందులో కంప‌ర్ట్ చూసుకుంటాను. అన్నింటికంటే ముఖ్యం నేనేంత సౌక‌ర్యంగా ఉన్నాను అన్న‌ది చూస్తాను.

అలా ఉన్న‌ప్పుడే ప్ర‌యోగానికి వెనుకాడ‌ను. నేను సినిమా ప్రపంచంలో ఎంతగానో నిమగ్నమై ఉన్నాను. విభిన్నమైన పాత్రలు చేయాలనుకుంటున్నాను. వాటిని ఎంత‌గా ప్రేమిస్తానో నాకే తెలుసు.` అని అంది. పాల‌క్ తివారీ సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్ర‌హీం అలీఖాన్ తో డేటింగ్ లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.