Begin typing your search above and press return to search.

హీరో వార‌సుడితో హీరోయిన్ రియ‌ల్ ల‌వ్!

సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్ర‌హీం అలీఖ‌న్ తో అమ్మ‌డు డీప ల‌వ్ లో మునిగి తేలుతున్న‌ట్లు మీడియా క‌థ‌నాలు వెడెక్కిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   12 Jun 2024 7:53 AM GMT
హీరో వార‌సుడితో హీరోయిన్ రియ‌ల్ ల‌వ్!
X

బాలీవుడ్ న‌టి శ్వేతా తివారీ వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన పాల‌క్ తివారీ సుప‌రిచిత‌మే. గ‌తేడాది స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించిన `కిసీకా భాయ్ కిసీకా జాన్` చిత్రంతో ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. `ది సాప్రాన్ చాప్ట‌ర్`...`ది వ‌ర్జిన్ ట్రీ` లాంటి చిత్రాల్లోనూ భాగ‌మైంది. నాలుగేళ్ల క్రిత‌మే లాంచ్ అయినా అమ్మ‌డి కెరీర్ మాత్రం ఇంకా పుంజుకోలేదు. ఈనేప‌థ్యంలో తాజాగా అమ్మ‌డు మ‌రో బాలీవుడ్ వార‌సుడితో ఎఫైర్ లో ఉన్న‌ట్లు లీకైంది.


సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్ర‌హీం అలీఖ‌న్ తో అమ్మ‌డు డీప ల‌వ్ లో మునిగి తేలుతున్న‌ట్లు మీడియా క‌థ‌నాలు వెడెక్కిస్తున్నాయి. గ‌త ఏప్రిల్ లోనే లోనే ఇద్ద‌రు గోవ‌రి ఎయిర్ పోర్టులో క‌నిపించారు. అప్పుడే ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌నే వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది కానీ పెద్ద‌గా హైలైట్ కాలేదు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. తాజాగా మ‌ళ్లీ అదే మ‌ళ్లీ జంట‌గా ఇబ్ర‌హీం అలీఖాన్ ఇంటి ముందు చిక్కారు.

పాల‌క్ తివారీ అత‌ని ఇంటి నుంచి కారు ఎక్కుతోన్న ఓవీడియో ఇన్ స్టాలో వైర‌ల్ అవుతుంది. దీంతో మ‌రోసారి నెట్టింట ఇద్ద‌రిపై చ‌ర్చ మొద‌లైంది. ఏడాది త‌ర్వాత మ‌ళ్లీ క‌నిపించ‌డంతో బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇద్ద‌రి మ‌ధ్య ల‌వ్ అనే బాండింగ్ లేకుండా ఇలా దేనికి ఇంట‌రాక్ట్ అవుతారంటూ కథ‌నాలు వైర‌ల్ అవుత‌న్నాయి.

వీళ్లిద్ద‌రు కూడా జాన్వీక‌పూర్ -శిఖ‌ర్ ప‌హారియాలాగే సీక్రెట్ గా ఉండటానికి ట్రై చేసి ఇలా మీడియాకి చిక్కుతున్నారంటూ ప్ర‌చారం ఠారెత్తిపోతుంది. బాలీవుడ్ లో ఇద్ద‌రు ఇంకా అంత ఫేమ‌స్ అవ్వ‌లేదు కాబ‌ట్టి వాళ్ల‌పై నిఘా లేద‌న్న‌ది కొంత‌రి సందేహం. ఏది ఏమైనా రెండ‌వ‌సారి కూడా చిక్కిన నేప‌థ్యంలో ఈ వార్త ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక నుంచి ఆ జోడీని మ‌రో క‌న్ను ఎప్పుడూ ఎంటాడుతూనే ఉంటుంది సుమీ.