దళిత క్రికెటర్ జీవితంలో ఆ స్టార్ హీరో!
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే `మైదాన్` తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు
By: Tupaki Desk | 31 May 2024 5:40 AM GMTబాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే `మైదాన్` తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. పుట్ బాల్ దిగ్గజం సయ్యద్ అబ్దుల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా అజయ్ కి ప్రత్యేకమైన ఇమేజ్ ని తీసుకొచ్చింది. కమర్శియల్ చిత్రాలకు పూర్తి భిన్నమైన సినిమా కావడంతో ప్రశంసలతో అజయ్ ని తారా స్థాయికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో బయోపిక్ కి సైన్ చేసారు.
భారతదేశ మొట్ట మొదటి దళిత క్రికెటర్ పల్వంకర్ బాలు జీవితం ఆధారంగా ఓ చిత్రం రానుంది. ఇందులో పల్వంకర్ పాత్రలో నటించడానికి అజయ్ రెడీ అవుతున్నాడు. ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్ర గుప్తా రాసిన `ఏ కార్నర్ ఆఫ్ ఏ ఫారెన్ ఫీల్డ్` పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తిగ్మాన్షు దూలియా తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత ప్రీతి సిన్హా సోషల్ మీడియా వేదకిగా రివీల్ చేసారు. పల్వంకర్ ఓ క్రికెట్ క్లబ్ లో గ్రౌండ్స్ మెన్ ప్రయాణం మొదలు పెట్టాడు.
1896 లో క్రీడాక్లబ్ హిందూ జింఖాన తరుపున క్రికెట్ ఆడేందుకు ఎంపికయ్యారు. అలా మొదలైన పల్వంకర్ క్రికెట్ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నాడు. ఎన్నో అవమనాలున్నాయి. తొలి మ్యాచ్ ఎంకియ్యే ముందు? ఎంపికైన తర్వాత క్లబ్ నుంచి చాలా సమస్యలు ఎదుర్కున్నారు. ఎదిగే క్రమంలో ఎన్నో అవరాధోలు చూసారు. ఆయన కథలో బలమైన ఎమోషన్ ఉంది. ఈ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించడానికి బాలీవుడ్ ముందుకొచ్చింది. సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బాలీవుడ్ లో బయోపిక్ లకు తిరుగులేదు. అక్కడ జీవిత కథలు డిమాండ్ పీక్స్ లో ఉంటుంది. వాటి ఫెయిల్యూర్స్ కన్నా సక్సెస్ రేట్ ఎక్కువ. అందుకే మేకర్స్ అంతా ఎమోషన్ ఉన్న జీవిత కథల్ని ఎంచుకుంటారు. తెలుగు పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్ కూడా హిందీలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన సినిమా మంచి విజయం సాధించింది.