2025 లో నెలకొక పాన్ ఇండియా సినిమా!
అటుపై రిలీజ్ అయ్యే సమ్మర్ రిలీజ్ లు కూడా అంతే క్రేజీగా ఉన్నాయి. ఏకంగా నెలొక సినిమా చొప్పున పాన్ ఇండియాలోనే అవి రిలీజ్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 4 Jan 2025 2:30 PM GMT2025 కొత్త సినిమాల రిలీజ్ జనవరి 10 నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 10న `గేమ్ ఛేంజర్`, 12న `డాకు మహారాజ్`, 14న `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాలతో రిలీజ్ హంగామా మొదలవుతుంది. మూడు సినిమాలపై భారీ అంచనాలున్నాయి. సంక్రాంతికి మూడు సినిమాలు ప్రేక్షకుల్ని అలరించడం ఖాయంగా కనిపిస్తుంది. అటుపై రిలీజ్ అయ్యే సమ్మర్ రిలీజ్ లు కూడా అంతే క్రేజీగా ఉన్నాయి. ఏకంగా నెలొక సినిమా చొప్పున పాన్ ఇండియాలోనే అవి రిలీజ్ అవుతున్నాయి.
ఇలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం అన్నది చాలా రేర్. ఆ రకంగా 2025 అభిమానులకు సంథింగ్ స్పెషల్ గానూ నిలిచే అవకాశం ఉంది. సంక్రాంతి రిలీజ్ లు అనంతరం ఫిబ్రవరి 7న నాగచైతన్య హీరోగా నటిస్తోన్న `తండేల్` రిలీజ్ అవుతుంది. ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ అవ్వాలి. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఫిబ్రవరికి మాత్రం పక్కాగా వచ్చే చిత్రంగా సమాచారం. నాగచైతన్య తొలి పాన్ ఇండియా సినిమా ఇదే.
దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి హైప్ క్రియేట్ అవుతుంది. అదే నెలలో `దిల్ రూబ`, `శబ్దం`లాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక మార్చిలో మాత్రం పవర్ కళ్యాణ్ నటిస్తోన్న `ఓజీ` రిలీజ్ పక్కా అని తెలుస్తోంది. షూటింగ్ దాదాపు క్లైమాక్స్ లో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. రిలీజ్ ఇప్పటికే వాయిదా పడి నేపథ్యంలో మార్చి 28న పక్కాగా రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు.
ఇక వేసవి ముమ్మరంగా ఉండే ఏప్రిల్ లో డార్లింగ్ ప్రభాస్ నటిస్తోన్న `రాజాసాబ్` చిత్రాన్ని రిలీజ్ చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్ పడిపోతున్న చిత్రాన్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని డార్లింగ్ కూడా సీరియస్ గానే ఉన్నాడు. దీనిలో భాగంగా ఆ సినిమా షూట్ లోనే బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 10న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణు నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `కన్నప్ప` ను కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని రెడీ అవుతున్నారు. ఇక మేలో మాత్రం రీజనల్ చిత్రాలు `హిట్ -3`, `మాస్ జాతర` సహ పలు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.