పాన్ ఇండియా అంటే కామెడీ అయిపోయింది!
ఈ కలెక్షన్లతో పాటే పాన్ ఇండియా ట్రెండ్ కూడా ఊపందుకుంది. ప్రతి చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాయి.
By: Tupaki Desk | 31 Oct 2023 1:30 AM GMTఒకప్పుడు రూ.100కోట్లు ఉన్న టాలీవుడ్ మార్కెట్‌ను దర్శకధీరుడు రాజమౌళి రూ.1000కోట్లు దాటేలా చేశారు. ఆ తర్వాత కన్నడలో కేజీయఫ్ 2తో ప్రశాంత్ నీల్ ఆ మార్కెట్‌ను టచ్ చేయగా.. మళ్లీ తెలుగులో జక్కన్ననే ఆర్ఆర్ఆర్ ఆ ఫీట్‌ను అందుకున్నారు. ఈ కలెక్షన్లతో పాటే పాన్ ఇండియా ట్రెండ్ కూడా ఊపందుకుంది. ప్రతి చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాయి.
ముఖ్యంగా తెలుగులో చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, రవితేజ, నాని, నిఖిల్, అఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్.. ఇలా చాలా మందే హీరోలు తమ కొత్త చిత్రాలను పాన్ ఇండియా రిలీజెస్గా అనౌన్స్ చేశారు. ఇక్కడి దాకా కథ బాగానే ఉంది. కానీ వీరిలో ఎంత మంది హీరోల సినిమాలు ఇతర భాషల్లో థియేటర్ల రిలీజ్‌కు నోచుకుంటున్నాయనేది పెద్ద ప్రశ్న. అవన్నీ కేవలం పాన్ ఇండియా పోస్టర్లగానే పరిమితమవుతున్నాయి. అనౌన్స్మెంట్ అప్పుడు రిలీజ్ అంటే హడావిడి చేస్తున్నారు వాళ్ళు చివరికి వాటిని సింగిల్ లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాన్ ఇండియా అంటే కామెడీ అయిపోయింది అనే తరహాలో సెటైర్లు పడుతున్నాయి.
ఆ మధ్యలో నిఖిల్ కార్తికేయ 2 ఒక్కటి మాత్రమే తెలుగు నుంచి పాన్ ఇండియా రేంజ్లో మంచి హిట్ అందుకుంది. నాని దసరా చిత్రాన్ని కొని బయర్స్ నష్టాన్ని చూడాల్సి వచ్చింది. అఖిల్ ఏజెంట్ అట్టర్ ఫ్లాప్. బెల్లంకొండ ఛత్రపతితో డైరెక్ట్ రిలీజ్ చేసినా బోల్తా కొట్టింది. రీసెంట్గా వచ్చిన మాస్ మాహారాజా టైగర్ నాగేశ్వరరావు కూడా తెలుగు తప్ప ఇతర సౌత్ భాషల్లో, నార్త్‌లో డిజాస్టర్‌గానే నిలిచింది.
అక్కడ పెద్దగా స్క్రీన్లను కూడా దక్కించుకోలేదు. ఇక మరికొంతమంది హీరోలు ఫ్యాన్ ఇండియా అని గట్టిగానే హడావిడి చేస్తున్నప్పటికీ మళ్ళీ రిలీఫ్ సమయానికి వచ్చేసరికి కేవలం తెలుగులోనే విడుదల చేస్తున్నారు. లేదంటే ఏదైనా ఒక భాషలో లిమిటెడ్ థియేటర్లలోనే విడుదల చేస్తున్నారు. కేవలం ఓ వర్గం స్టార్ హీరోలు మాత్రమే ఈ రోజుల్లో పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ వాళ్ళు కూడా హై రేంజ్ లో అయితే సక్సెస్ కావడం లేదు. అలా చాలా చిత్రాలకు ఇలానే జరుగుతోంది. బయర్స్ చాలా మంది కొనేందుకు ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. వారు కొనుగోలు చేస్తే థియేట్రికల్ రిలీజెస్ జరుగుతున్నాయి. అయితే అదే సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్.. సదరు చిత్రాల రైట్స్‌ను అన్ని భాషల్లోనూ కొనుగోలు చేస్తున్నాయి. దీంతో థియేట్రికల్ రిలీజెస్ లేక సినిమా చూడాలనుకున్న కొంతమంది ఆడియెన్స్ కూడా ఓటీటీలోనే చూడాల్సి వస్తోంది. చూడాలి మరి ఇక నెక్ట్స్ చిరంజీవి - వశిష్ట కాంబో, పవన్ హరిహరవీరమల్లు, వెంకటేశ్ సైంధవ్, అఖిల్ కొత్త చిత్రాలకు పాన్ ఇండియా లెవల్లో ఇతర భాషల్లో ఎంత వరకు థియేట్రికల్ రిలీజెస్ దొరుకుతాయో.