మాట తప్పని మడం తిప్పని హీరో!
మరి డార్లింగ్ వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? అన్నది తెలియాలంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటలు వినాల్సిందే. 'నేను ప్రభాస్ కి వీరాభిమానిని. ప్రెండ్ అని, తోటి నటుడు అని ఆ మాట చెప్పడం లేదు.
By: Tupaki Desk | 23 Jun 2024 7:00 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ హీరోగా ఎలా ఉంటాడు? అన్నది అందరికీ తెలుసు. అలాగే సెట్స్ లో సహ నటులతో ఎలా నడుచుకుంటాడు? అన్నది కూడా తెలుసు. అందర్నీ సమభావంతో చూస్తాడు. అందులో హీరోయిన్లకు పుడ్ తినిపించడం విషయంలో డార్లింగ్ ని మించిన హీరో మరొకరు ఉండరు అన్నది తెలుసు. ఈయన పుడ్ తినిపించి తినిపించి చంపేస్తాడు? అని అంతా అంటారు. ఇంతవరకూ అందరికీ తెలిసిందే.
మరి వ్యక్తిగతంగా డార్లింగ్ ఎలా ఉంటాడు? అన్నది మాత్రం ఇంతవరకూ ఎక్కడా బయటకు రాలేదు. గతంలో ప్రభాస్ వ్యక్తిగతంగా పూరిజగన్నాధ్ ని అతని ఫ్యామిలీని ఎంతగా అభిమానిస్తాడు? అన్నది తానే స్వయంగా చెప్పారు. పూరి వైఫ్ కి తన మన అనే బేధం ఉండదని, ఇంట్లో పని మనుషుల పట్ల ఎలాంటి బేధం లేకుండా పక్కన కూర్చోబెట్టుకుని పుడ్ పెడతారని అంత గొప్ప మనసు పూరి వైఫ్ లావణ్యది అని చెప్పారు.
పూరి కూడా అలాగే ఉంటారని జాతి, మత, కుల, ప్రాంతం అనే బేధం లేకుండా ఉంటారని, ఎంతో మంచి మనిషి అని అన్నారు. మరి డార్లింగ్ వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? అన్నది తెలియాలంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటలు వినాల్సిందే. 'నేను ప్రభాస్ కి వీరాభిమానిని. ప్రెండ్ అని, తోటి నటుడు అని ఆ మాట చెప్పడం లేదు. తనది చాలా మంచి వ్యక్తిత తత్వం. తనలో ఉన్న మంచి క్వాలిటీలు అన్నీ ఇన్నీ కావు.
ఒకటి..రెండు అయితే చెప్పొచ్చు. చేతనైతే ఎవరికైనా సహాయం చేయాలని చూస్తాడు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడు. మాట తప్పని మడం తిప్పని ప్రభాస్ ని చాలాసార్లు దగ్గర నుంచి చూసిన వాడిని. 'బాహుబలి' సినిమా సమయంలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ ఇచ్చిన మాట కోసం మరో సినిమా చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ ఆరు అడుగుల బంగారం' అని అన్నారు. ఇక బన్నీ దాతృత్వం గురించి చెప్పాల్సిన పనిలేదు. సహాయ కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాడు. కానీ తనకి ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే తన సహాయమంతా కెమెరా వెనుక మాత్రమే ఉంటుంది.