పాన్ ఇండియా డేట్స్.. మళ్ళీ ఎన్ని మారుతాయో!
ఈ ఏడాది టాలీవుడ్ లో అరడజనుకి పైగా పాన్ ఇండియా సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి.
By: Tupaki Desk | 31 May 2024 5:32 AM GMTఈ ఏడాది టాలీవుడ్ లో అరడజనుకి పైగా పాన్ ఇండియా సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అన్ని కూడా 150+ కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమాలే కావడం విశేషం. మన స్టార్ హీరోలు అందరూ కూడా యూనివర్సల్ కథలని తీసుకొని అన్ని భాషలలో ప్రేక్షకులకి రీచ్ కావడానికి సినిమాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సినిమాలు చేసేటపుడు కేవలం ఒక్క తెలుగులోనే రిలీజ్ అయితే నిర్మాతలకి ఎలాంటి లాభాలు రావు. అందుకే వీలైనన్ని ఎక్కువ భాషలలో మూవీస్ ని రిలీజ్ చేస్తున్నారు.
వరల్డ్ వైడ్ గా భాషాపరిమితం లేకుండా ప్రేక్షకులకి కంటెంట్ కనెక్ట్ అయితే కలెక్షన్స్ కూడా సాలిడ్ గా వస్తాయని ఇప్పటికే చాలా మూవీస్ ప్రూవ్ చేశాయి. ఈ ఏడాది వచ్చిన హనుమాన్ చిత్రం కూడా అదే స్థాయిలో కనెక్ట్ అయ్యి 300 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. అయితే పాన్ ఇండియా సినిమాలు అనేసరికి రిలీజ్ డేట్ పెద్ద సమస్యగా మారుతోంది. కంటెంట్ క్వాలిటీ, విజువలైజేషన్ గ్రాండియర్ గా ఉండటం కోసం విజువల్ ఎఫెక్ట్స్ మీద డిపెండ్ అవుతున్నారు.
విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కి ఎక్కువ సమయం పడుతోంది. ఈ కారణంగా ప్రతిసారి రిలీజ్ డేట్స్ వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఈ ఏడాది రిలీజ్ కాబోయే టాలీవుడ్ పాన్ ఇండియా మూవీస్ లో జూన్ 27న కల్కి 2898ఏడీ థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా ఇప్పటికి మూడు సార్లు రిలీజ్ డేట్ వాయిదా పది ఫైనల్ గా జూన్ కి ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే ప్రమోషన్స్ నడుస్తున్నాయి కాబట్టి వాయిదా పడే ఛాన్స్ లేదు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ఆగష్టు 15న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆల్ మోస్ట్ అదే డేట్ కి ఈ సినిమా విడుదల కావడం ఖాయం అనే మాట అయితే వినిపిస్తోంది. ఏవో అనివార్య కారణాలు ఉంటే తప్ప వాయిదా పడకపోవచ్చు. నెక్స్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఏప్రిల్ లో అనుకున్న రిలీజ్ డేట్ అక్టోబర్ కి వెళ్ళింది. అయితే అంతకంటే ముందుగా సెప్టెంబర్ 27న రిలీజ్ కావొచ్చని మాట వినిపిస్తోంది.
రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ అక్టోబర్ రిలీజ్ అవుతుందని అంటున్నారు. అయితే డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. చివరి రెండు నెలల్లో కూడా రిలీజ్ కి ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది. పవర్ కళ్యాణ్ ఓజీ సెప్టెంబర్ లో రిలీజ్ అనుకున్నారు. అది సాధ్యమయ్యే ఛాన్స్ లేదు. డిసెంబర్ లో ఓజీ మూవీ రావొచ్చనే మాట వినిపిస్తోంది. అలాగే, హరిహర వీరమల్లు సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని నిర్మాత అంటున్నారు. అయితే మేగ్జిమమ్ వాయిదా పడే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల మాట.