రివ్యూ : పాపం పసివాడు (వెబ్ సీరీస్)
సింగర్ శ్రీరామ్ చంద్ర తనలోని నటుడిని అప్పుడప్పుడు బయట పెడుతుంటాడు. ఇండియన్ ఐడల్ గా గెలిచిన అతను హీరోగా కొన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. లేటెస్ట్ గా మరోసారి అలాంటి ప్రయత్నం చేశాడు.
By: Tupaki Desk | 1 Oct 2023 4:36 AM GMTనటీనటులు : శ్రీరామ చంద్ర, రాశీ సింగ్, గాయత్రి చాగంటి, శ్రీవిద్య మహర్షి, మ్యాడీ మనేపల్లి, అశోక్ కుమార్, సుజాత, శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ : గోకుల్ భారతి
సంగీతం, సాహిత్యం : జోస్ జిమ్మీ
నిర్మాత : అఖిలేష్ వర్ధన్
దర్శకత్వం : లలిత్ కుమార్
సింగర్ శ్రీరామ్ చంద్ర తనలోని నటుడిని అప్పుడప్పుడు బయట పెడుతుంటాడు. ఇండియన్ ఐడల్ గా గెలిచిన అతను హీరోగా కొన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. లేటెస్ట్ గా మరోసారి అలాంటి ప్రయత్నం చేశాడు. ఈసారి వెబ్ సీరీస్ లో మెయిన్ లీడ్ గా చేశాడు శ్రీరామ్ చంద్ర. లలిత్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పాపం పసివాడు వెబ్ సీరీస్ లో శ్రీరామ్ చంద్ర, రాశీ సింగ్, గాయత్రి చాగంటి, శ్రీవిద్య మహర్షి నటించారు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సీరీస్ ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
ఆరు ఏళ్లుగా ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్పడంతో ఆ బాధతో రోజులు గడుపుతుంటాడు క్రాంతి (శ్రీరామ్ చంద్ర). తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని ప్రెజర్ చేస్తుంటారు. వాళ్ల నుంచి కాస్త దూరంగా ఉండేందుకు ఫ్రెండ్ నాసా (మ్యాడీ మానేపల్లి ) ఇంటికి వెళ్తాడు . అతని ఇంట్లో ఉంటున్న శ్రీరాం చంద్ర ఓ నైట్ పబ్ లో తాగేసి అనుకోని పరిస్థితుల్లో చారు (రాశీసింగ్) ఫ్లాట్ కి వెళ్తాడు. అక్కడ ఆమెతో టైం స్పెండ్ చేసి పొద్దున్నే ఫ్రెండ్ రూం కి విచిత్రంగా వస్తాడు. ఓ పక్క ఇంట్లో వాళ్లు అతనికి అనూష (శ్రీవిద్య మహర్షి) తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అనూతో క్రాంతి శ్రీరామ్ చంద్ర కాఫీ షాప్ మీటింగ్ తో ఆమెతో పెళ్లి ఫిక్స్ చేసుకుంటాడు. అను ఎంగేజ్మెంట్ లో కూడా కనిపిస్తుంది. అదే టైం లో తనకి బ్రేకప్ చేసిన డింకీ (గాయత్రి చాగంటి) కూడా తిరిగి అతని లైఫ్ లోకి వస్తుంది. అనూతో ఎంగేజ్మెంట్ తర్వాత శ్రీరాం చంద్ర ముగ్గురిని ఎలా మ్యానేజ్ చేశాడు. చివరకు ఏమైంది అన్నది వెబ్ సీరీస్ కథ.
కథనం - విశ్లేషణ :
ఈవెంట్ మేనేజర్ అయిన క్రాంతి తన లైఫ్ లో ఒక మంచి అమ్మాయిని ఆహ్వానించాలని అనుకుంటాడు. 6 ఏళ్లు ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్లగా.. మధ్యలో యాక్సిడెంటల్ గా ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. అయితే ఆమె అడ్రస్ తెలియకపోవడంతో ఆమెను కోసం వెతికి ఇంట్లో వారి పోరు భరించలేక మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతాడు. అలా ఎంగేజ్మెంట్ కి రెడీ అయిన అతని లైఫ్ లోకి తను వెతికే అమ్మాయి వస్తుంది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడంతో ఆ అమ్మాయితో కలిసి తన ప్రేమను పొందాలని అనుకుంటాడు. ఈలోగా అతన్ని కాదని వెళ్లిన అమ్మాయి కూడా అతన్ని వెతుక్కుంటూ మళ్లీ వస్తుంది. ఈ ముగ్గురు అమ్మాయిల్లో క్రాంతి ఎవరిని ప్రేమించాడు.. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అన్నదే ఈ వెబ్ సీరీస్ కథాంశం.
క్రాంతి పాత్ర అతని క్యారెక్టరైజేషన్ ఏదో కొత్తగా కన్ ఫ్యూజ్డ్ గా ఏదో కొత్తగా ట్రై చేయాలని చూశారు కానీ అది అంతగా వర్క్ అవుట్ కాలేదు. అయితే మొత్తం సీరీస్ లో అతని పాత్ర సరదాగా అనిపిస్తుంది. పేరెంట్స్ ని కాదని వెళ్లి ఫ్రెండ్ ఇంట్లో మత్తులో మునిగే అలవాటు హీరోకి ఉండటం అనేది దర్శకుడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటన్నది అర్థం కాదు. ఇక ఐదు ఎపిసోడ్ లో ఏ ఒక్క ఎపిసోడ్ అంత ఎంగేజింగ్ గా అనిపించలేదు.
మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఏదో వెళ్తుంది అంటే వెళ్తుంది అన్నట్టు ఉంది తప్ప ఎక్కడ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వదు. అంతేకాదు పాత్రల మధ్య ఎమోషన్ కూడా వర్క్ కాలేదు. క్రాంతి ని వెంటబడే డింపు, క్రాంతి వెంటబడే చారు.. క్రాంతిని ఇష్టపడే అనూష ఈ ముగ్గురు క్రాంతికి అసలు ఎందుకు అతన్ని కావాలని అనుకుంటారన్నది సరిగా చూపించలేదు.
ఐదు ఎపిసోడ్ లో చివరి ఎపిసోడ్ అందరు కలిసి క్రాంతిని ఎటాక్ చేసే ఆ ఎపిసోడ్ తప్ప మిగతా అంతా కూడా ఏదో నడిపించినట్టు ఉంటుంది తప్ప పెద్దగా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. పాపం పసివాడు అంటూ క్రాంతి గురించి టైటిల్ పెట్టినా అసలు అతని ఆలోచన విధానం ఏంటన్నది చూపించలేకపోయారు. అంతేకాదు చివర్లో అతనికి పెళ్లైనట్టు చూపించారు. తను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరన్నది సస్పెన్స్ లో ఉంచారు. బహుశా అది సెకండ్ సీజన్ లో రివీల్ చేస్తారు కావొచ్చు.
కథ పరంగా అంత కొత్తగా ఏం లేదు రొటీన్ రెగ్యులర్ కథనే డైరెక్టర్ పాపం పసివాడు అంటూ తీశాడు. కథనం అయినా కొత్తగా ఉంటుంది అంటే అది కూడా అదే పంథాలో కొనసాగించాడు. నాసా పాత్ర తన ఇంట్లోనే డ్రగ్స్ ని వాడటం.. అతను రాఖీ లాంటి విలన్ వస్తే తన్నులు తినడం ఇవేవి అసలు లాజిక్ గా అనిపించవు. అక్కడక్కడ కామెడీ అది కూడా లిమిటెడ్ గానే ఉంది. ఎపిసోడ్ లన్నీ కూడా త్వరగా ముగిశాయన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కానీ అని సీరీస్ కంప్లీట్ ఎంటర్టైన్ చేసిందా అంటే లేదని చెప్పొచ్చు.
నటీనటులు ;
శ్రీరామ్ చంద్ర క్రాంతి పాత్రలో మెప్పించాడు. దర్శకుడు తన క్యారెక్టరైజేషన్ లో క్లారిటీ మిస్ అయ్యాడు తప్ప శ్రీరామ్ చంద్ర మాత్రం తన వరకు బాగానే చేశాడు. చారు పాత్రలో రాశీ సింగ్ పర్వాలేదు అనిపించింది. శ్రీవిద్య కూడా తన పాత్రకు న్యాయం చేసింది. డింపి పాత్రలో గాయత్రి చాగంటి మొండి అమ్మాయిగా బాగానే చేసింది. ఇక గుండు అశోక్ కుమార్, మ్యాడీ, సుజాత, శ్రీనివాస్ అందరు ఓకే అన్నట్టుగా చేశారు.
సాంకేతిక వర్గం :
గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ నీట్ గానే ఉంది. జోస్ జిమ్మీ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంప్రెస్ చేసింది. లలిత్ కుమార్ దర్శకత్వం నిరాశపరచింది. రొటీన్ కథను అంతే రొటీన్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్లారు. ఎపిసోడ్ నుంచి ఎపిసోడ్ సీజన్ ఎండింగ్ ఇవన్ని కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో విఫలమయ్యాయి.
చివరగా :
పాపం పసివాడు.. రొటీన్ కథ.. మెప్పించలేని కథనం..!