Begin typing your search above and press return to search.

నా సినిమా అంటే ఎలా ఆపాలని చూస్తారు.. సెన్సార్ పై డైరెక్టర్ ఫైర్..!

జనవరి 25న రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

By:  Tupaki Desk   |   2 Feb 2024 3:30 AM GMT
నా సినిమా అంటే ఎలా ఆపాలని చూస్తారు.. సెన్సార్ పై డైరెక్టర్ ఫైర్..!
X

సూపర్ స్టార్ రజినీతో కబాలి సినిమా తీసి పాన్ ఇండియా లెవెల్ లో తన గురించి మాట్లాడుకునేలా చేసిన దర్శకుడు పా రంజిత్ తన డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలతోనే కాకుండా తన సొంత బ్యానర్ నీలం ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న సినిమాలు కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. లేటెస్ట్ గా నీలం ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన సినిమా బ్లూస్టార్. అశోక్ సెల్వన్, శాంతను, పృధ్వి పాండియరాజన్, కీర్తి పాండియన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాను జై కుమార్ డైరెక్ట్ చేశారు.


జనవరి 25న రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత పా. రంజిత్ బ్లూస్టార్ పై సెన్సార్ పెట్టిన ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. నీలం ప్రొడక్షన్స్ నుంచి సినిమా వస్తుందంటే సెన్సార్ బోర్డు సభ్యులు రెడీగా ఉంటారని ఆయన ఫైర్ అయ్యారు. మిగతా సినిమాలకు ఏమో కానీ బ్లూ స్టార్ సినిమాకు ఎలాంటి సమస్యలు లేకుండా రిలీజ్ అవుతుందని అనుకున్నా కానీ ఈ సినిమా కూడా రిలీజ్ కాకూడదని కొందరు అనుకున్నారు. అది నాకు తెలిసి షాక్ అయ్యానని అన్నారు పా రంజిత్.

బ్లూస్టార్ సినిమా నాయకుడు పూవై జగన్ మూర్తియార్ కథలా ఉందని.. ఆయనను ఒక రౌడీగా సినిమాలో చూపించారని.. పూవై మూర్తియార్ తమను చదివించిన మంచి మనిషని.. పెద్ద నాయకుడని.. ఆయన్ను ఎలా రౌడీగా చిత్రీకరిస్తానని తాను వారితో వాధించానని అన్నారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు వారు ఇబ్బంది పెట్టిన విషయాన్ని చెప్పారు. అందుకే రివైజింగ్ కమిటీకి ఎళ్లి అక్కడ సూచించిన కొన్ని మార్పులతో బ్లూస్టార్ ని రిలీజ్ చేశామని అన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల మెప్పు పొందిందని.. సమైక్యతను చాటి చెప్పే ఇలాంటి సినిమాకు సెన్సార్ సమస్యలు సృష్టించడం విచిత్రంగా ఉందని పా రంజిత్ అన్నారు.

పా రంజిత్ సినిమాలే కాదు ఆయన స్పీచ్ లు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. తాము చేసిన ఈ సిన్సియర్ ఎఫర్ట్ ని సెన్సార్ టీం అడ్డుకోవాలని అనుకుందని.. అంతేకాదు తన సినిమా వస్తుంది అంటే దాన్ని ఎలా ఆపాలని సెన్సార్ టీం చూస్తుందని సంచలన కామెంట్స్ చేశారు పా రంజిత్. ప్రస్తుతం ఆయన సెన్సార్ టీం పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.