Begin typing your search above and press return to search.

ఆ రెండు సినిమాల‌తో ప్ర‌భాస్ బిజీ బిజీ!

`స‌లార్` రిలీజ్ త‌ర్వాత డార్లింగ్ ప్ర‌భాస్ ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమా షూటింగ్ మొద‌లు పెట్ట‌లేదు.

By:  Tupaki Desk   |   9 Aug 2024 4:53 AM GMT
ఆ రెండు సినిమాల‌తో ప్ర‌భాస్ బిజీ బిజీ!
X

`స‌లార్` రిలీజ్ త‌ర్వాత డార్లింగ్ ప్ర‌భాస్ ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమా షూటింగ్ మొద‌లు పెట్ట‌లేదు. `రాజాసాబ్` లైన్ లో ఉన్నా? డార్లింగ్ రెస్ట్ మోడ్ లో ఉండ‌టంతో ఆ సినిమా షూటింగ్ రీ స్టార్ట్ చేయ‌లేదు. విదేశాల్లో వెకేష‌న్లు..ప్రెండ్స్ తో పార్టీలంటూ ఎంజాయ్ చేసారు. `స‌లార్` స‌క్సెస్ ని విదేశాల్లోనే గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకున్నారు. తాజాగా రెస్ట్ మోడ్ నుంచి వ‌ర్క్ మోడ్ కి రెడీ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో కొత్త సినిమా కూడా మొద‌లు పెడుతున్న‌ట్లు తెలుస్తోంది.

హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో పీరియాడిక్ వార్ ల‌వ్ స్టోరీ లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. కొన్ని నెల‌లుగా హ‌ను ఈసినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లోనే బిజీగా ఉన్నారు. తాజాగా ఆ ప‌నుల‌న్నింటిని ముగించి ఈనెల 17 న చిత్రాన్నిప్రారంభించ‌డానికి ముహూర్తం కూడా పెట్టేసిన‌ట్లు స‌మాచారం. అనంత‌రం రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా ఇదే నెల‌లో మొద‌లు పెట్టాల‌ని భావిస్తున్నారు. దీంతో పాటు మారుతి `రాజాసాబ్` షూటింగ్ కూడా ఇదే నెల‌లో మొద‌లు కానుందిట‌.

రెండు సినిమాల‌కు ప్ర‌భాస్ ఒకేసారి డేట్లు కేటాయించారుట‌. దీంతో ద‌ర్శ‌కులు డేట్లే క్లాష్ కాకుండా షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అంటే డార్లింగ్ ఈనెల నుంచి మ‌ళ్లీ షూట్ లో బిజీ అవుతాడ‌ని తేలిపోయింది. ఆయ‌న మొద‌లు పెట్టాడంటే ఆగ‌డు. పూర్త‌య్యేవ‌ర‌కూ మ‌రే ప‌నులు పెట్టుకోడు. షూటింగ్ విష‌యంలో డార్లింగ్ పెట్టుకున్న రూల్ అది. ఈ ఏడాదంతా ఆ రెండు సినిమాల షూటింగ్ ల‌తోనే బిజీగా ఉంటాడ‌ని తెలుస్తోంది.

దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా చిత్రాన్ని కూడా ఇదే ఏడాది చివర్లో ప్రారంభించాల‌ని ప్లాన్ చేసుకుంటు న్నాడుట‌. అంటే ఆలోగా రాజాసాబ్ షూటింగ్ ని మారుతి పూర్తి చేయాలి. ఇప్ప‌టికే కొంత భాగం పూర్త‌యిన నేప‌థ్యంలో ఎక్కువ స‌మ‌యం కూడా పట్ట‌దు. ఇక `స‌లార్ -2` వ‌చ్చే ఏడాది మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది.