ఇండియన్స్ లో క్రియేటర్స్ ని బయటకు తెచ్చింది వాళ్లేనా!
అప్పట్లో ఓ టాలీవుడ్ డైరెక్టర్ సినిమా కథల విషయంలో చాలా మంది దర్శకులు హాలీవుడ్ చిత్రాలపైనే ఆధార పడతారని సంచలన ఆరోపణలు చేసారు.
By: Tupaki Desk | 27 Feb 2025 10:30 AM GMTఅప్పట్లో ఓ టాలీవుడ్ డైరెక్టర్ సినిమా కథల విషయంలో చాలా మంది దర్శకులు హాలీవుడ్ చిత్రాలపైనే ఆధార పడతారని సంచలన ఆరోపణలు చేసారు. హాలీవుడ్ సినిమాలు చూసే చాలా మంది మంది తెలుగు దర్శకులు సినిమాలు తీస్తారని....సీన్ టూ సీన్ దించేసే దర్శకులు చాలా మంది ఉన్నారని ఆరోపించారు. మేకింగ్ విషయంలో కూడా చాలా మంది ఇదే విధానంలో ముందుకెళ్తారని...వాళ్లకంటూ సొంత కథలంటూ ఏవీ ఉండవని అన్నారు.
ఇది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉందని అన్నారు. ఇప్పుడు మీడియా పెరగడం.. .సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతోనే? అసలు బండారాలు బయట పడుతున్నాయని ఇదేం పెద్ద విషయం కాదన్నట్లే ఆయన మాట్లాడారు. మనోళ్లు హాలీవుడ్...బాలీవుడ్ నుంచి కాపీ కొడుతుంటారు. ఇంకొందరు ఇతర భాషల నుంచి లిప్ట్ చేస్తుంటారన్నారాయన.
తాజాగా బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కూడా ఇండస్ట్రీలో తానుచూసిన పరిస్థితులు..అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. ` బాలీవుడ్ కాపీ కొట్టడం అన్నది మొదట్లోనే నేను చూసాను. డైరెక్టర్ దగ్గరకు వెళ్లి సినిమా తీయాలనుకుంటున్నాను అనే విషయాన్ని చెబితే మీకో దుమ్ము పట్టిన క్యాసెట్ చేతిలో పెట్టి నువ్వు ఈ సినిమా చూడు. నేను మరో సినిమాచూస్తాను. రెండు కలిపి ఓ సినిమా తీద్దాం అని సలహా ఇచ్చేవారు.
ఒకప్పుడు సినిమా తీసే విధానం అంతా ఇలాగా ఉండేది. అయితే ఇండియాలోకి హాలీవుడ్ స్టూడియోలు ప్రవేశించడంతో ఆ వేగానికి కళ్లెం పడింది. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు కాపీ కొట్టాలంటే వాళ్ల దగ్గర నుంచి రైట్స్ తీసుకోవాలి. అందు కోసం భారీ మొత్తంలో డబ్బు చెల్లించాలి. లేకపోతే రైట్స్ రావు. ఇంత ఖర్చు పెట్టి తీసిన తర్వాత సినిమా పోతే నిర్మాత గోల పెడతాడు.
ఇదంతా ఎందుకని ఇప్పుడు చాలా మంది దర్శకులు ఆలోచించి కథలు రాయడం...సినిమాలు తీయడం మొదలు పెట్టారు. లేకపోతే మనవారంతా ఇంకా హాలీవుడ్ మీద ఆధారపడే సినిమాలు తీసేవారు` అని అన్నారు. దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.