బ్లాక్ పీస్ లో వైట్ పీస్ బీచ్ బ్యూటీ!
బాలీవుడ్ లో పరిణితి చోప్రా కెరీర్ నత్తనడకన సాగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 Oct 2024 7:30 PM GMTబాలీవుడ్ లో పరిణితి చోప్రా కెరీర్ నత్తనడకన సాగుతోన్న సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభించి 14 ఏళ్లు గడుస్తున్నా? ఇప్పటి వరకూ స్టార్ లీగ్ లో స్థానం సంపాదించలేదు. వచ్చిన అవకాశాలతో సంతృప్తి పడి కెరీర్ ని ముందుకు నడిపించడం తప్పా తానో బ్రాండ్ అని మార్కెట్ లో ప్రూవ్ చేయలేకపోయింది. ఇదే క్రమంలో రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దాని ప్రేమ వివాహం చేసుకుంది.
ఆ తర్వాత సినిమాలు కంటున్యూ చేస్తానని ప్రకటించిందిగానీ అమ్మడికి అవకాశాలైతే వస్తున్నట్లు లేదు. ఈ మూడేళ్ల కాలంలో ఏడాదికో సినిమా చొప్పున చేసిందంతే. `మిషన్ రాణీ గంజ్`..`అమర్ సింగ్ చంకీ లాలా` చివరి సినిమా. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకూ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అలా పరిణీతి చోప్రాప్రొఫెషనల్ కెరీర్ నడుస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు వెకేషన్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. పెళ్లైనా అమ్మడు దూకుడు ఏమాత్రం తగ్గలేదు. తనలో అదే బ్యూటీని హైలైట్ చేస్తోంది. బీచ్ వేర్ ఫోటోల్ని షేర్ చేయడం కొనసాగిస్తుంది. పెళ్లైన కొత్తలో కుటుంబ సభ్యులతో వెకేషన్ కి వెళ్లినా? పరిణితి తడిపోడి అందాల్ని అదే తీరున హైలైట్ చేసింది. ఆ తర్వాత చాలా సందర్భాల్లో హాట్ ఫోటోలతో దాడి చేసింది.
తాజాగా అమ్మడు మరోసారి బీచ్ అందాల్లో విహరిస్తుంది. ఇదిగో ఇక్కడిలా బ్లాక్ కలర్ దుస్తుల్లో ఒదిగిపోయింది. వేడిని తట్టుకునేలా సన్ గ్లాసెస్ ధరించింది. ఇసుక తిన్నెలుపై సెల్పీలు దిగి సంబర పడింది. ఈసారి పరిణితో పాటు భర్త రాఘవ్ చద్దా కూడా పాల్గొన్నాడు. ఇద్దరు జంటగా కొన్ని ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.