పెళ్లి తర్వాత మళ్లీ చెలరేగుతోందిగా
పారీ తనదైన గ్లామర్ ని ఎలివేట్ చేస్తూ వరుస ఫోటోషూట్లలో పాల్గొంటోంది.
By: Tupaki Desk | 16 Feb 2025 3:54 AM GMTఆప్ నాయకుడు రాఘవ్ చద్దాను పెళ్లాడాక పరిణీతి చోప్రా కొంత స్తబ్ధుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రేమ వివాహం తర్వాత కొంతకాలంగా గ్లామరస్ ఫోటోషూట్లకు బ్రేక్ పడింది. కానీ ఇప్పుడు మళ్లీ యథావిధిగా ఈ బ్యూటీ వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. పారీ తనదైన గ్లామర్ ని ఎలివేట్ చేస్తూ వరుస ఫోటోషూట్లలో పాల్గొంటోంది.
తాజాగా పారి ఒక భారీ లాంచ్ ఈవెంట్‌లో కనిపించింది. ఆ సమయంలో తన యూనిక్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి పరిణీతి ఫ్యాషన్ గేమ్ ఇటీవల పెద్ద చర్చగా మారింది. పరిణీతి ఆల్ క్లాసిక్ బ్లాక్ లుక్ లో అందరి దృష్టిని ఆకర్షించింది. మోనోక్రోమ్ స్టైల్‌తో ఆఫ్ షోల్డర్ మినీ డ్రెస్‌లో పారీ ప్రత్యేకంగా కనిపించింది. ఈ లుక్ కి తగ్గట్టే ఎంపిక చేసుకున్న ఆభరణాలు ఆకట్టుకున్నాయి. ఇంతకుముందు పరిణీతి బ్రౌన్ బాడీకాన్ డ్రెస్‌లో ఫోటో షూట్ లో పాల్గొంది. ఆఫ్ షోల్డర్ ప్యాటర్న్ ఫిగర్ గ్రేజింగ్ స్టైల్ ఎంతో ఆకట్టుకుంది. ఆసక్తికరంగా పరిణీతి మేకప్ లెస్ రూపంలో కనిపిస్తోంది. వేదికలపై అనవసర హంగామాను సృష్టించేందుకు ఈ భామ అస్సలు ఇష్టపడదు.
పరిణీతి నెక్ట్స్ ఏంటి? అంటే... ఈ భామ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. కొత్తగా పెళ్లయింది గనుక పారీ తన భర్త కోసం విలువైన సమయాన్ని వెచ్చిస్తోంది. ఇంతలోనే ఈ బ్యూటీ తిరిగి నటనలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ దర్శకనిర్మాతలతో మంతనాలు సాగిస్తోందని సమాచారం.