Begin typing your search above and press return to search.

బాగా తిని లావెక్కిన న‌టి చివ‌రికి ఇలా

అయితే అదంతా త‌న పాత్ర కోసం మేకోవ‌ర్. అధిక బ‌రువు పెర‌గ‌మ‌ని ద‌ర్శ‌కుడు చెప్పారు. ఈ మారిన రూపం తన అభిమానులను షాక్ కి గురి చేసింది.

By:  Tupaki Desk   |   18 Feb 2025 2:30 AM GMT
బాగా తిని లావెక్కిన న‌టి చివ‌రికి ఇలా
X

రెండు సంవత్సరాలకు పైగా బాగా తిని లావెక్క‌డంతో త‌న‌కు చాలా స‌మస్య‌లు వ‌చ్చాయ‌ని, మారిన రూపం కార‌ణంగా చాలా అవ‌కాశాల్ని కోల్పోయాన‌ని తెలిపింది ప‌రిణీతి చోప్రా అలియాస్ పారీ. 'అమర్ సింగ్ చంకీలా' బ‌యోపిక్ చిత్రీకరణ స‌యయంలో త‌న పాత్ర కోసం మేకోవ‌ర్ చేసాన‌ని, కానీ అది త‌న‌ను ఇబ్బందుల పాల్జేసింద‌ని పారీ పేర్కొంది. ఆ సమయంలో తన లుక్ బాలేద‌ని, న‌ట‌న బాగా లేదని, తాను గర్భవతి అని, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాన‌ని పుకార్లు వచ్చిన‌ట్టు ప‌రిణీతి చెప్పింది.

అయితే అదంతా త‌న పాత్ర కోసం మేకోవ‌ర్. అధిక బ‌రువు పెర‌గ‌మ‌ని ద‌ర్శ‌కుడు చెప్పారు. ఈ మారిన రూపం తన అభిమానులను షాక్ కి గురి చేసింది. అందుకే సినిమా విడుద‌ల‌య్యాక మ‌ళ్లీ చాలా శ్ర‌మించి మరింత ఫిట్‌గా మారాన‌ని ప‌రిణీతి తెలిపింది. పరిణీతి చోప్రా గ‌త ఏడాది ఆప్ నాయ‌కుడు త‌న స్నేహితుడైన‌ రాఘవ్ చద్దాను వివాహం చేసుకుంది. ఇటీవ‌ల బ‌రువు పెరిగిన క్ర‌మంలో, ప‌రిణీతి గర్భం దాల్చిందని పుకార్లు వచ్చాయి. ఈ విష‌యాన్ని ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించింది.

తాను గ‌ర్భం దాల్చాన‌నే అనుమానాలొచ్చాయి. కానీ నెట్‌ఫ్లిక్స్ చిత్రం 'అమర్ సింగ్ చంకిలా'లో నేను ఎంచుకున్న‌ పాత్ర కోసం దర్శకుడు ఇంతియాజ్ అలీ 15 కిలోలు పెరగమని, ఎటువంటి మేకప్ లేకుండా కనిపించమని కోరారని పారీ తెలిపింది. త‌న పాత్ర కోసం ప‌రివ‌ర్త‌న చాలా మంది ర‌క‌ర‌కాలుగా ఆలోచించ‌డానికి కార‌ణ‌మైంద‌ని ప‌రిణీతి తెలిపింది. బాగా బ‌రువు త‌గ్గాక లేటెస్ట్ ఫోటోషూట్ తో మ‌రోసారి అభిమానుల‌కు ప‌రిణీతి షాకిచ్చింది. ఇప్ప‌టికే పారీ కొత్త మేకోవ‌ర్ కి సంబంధించిన గ్లామ్ స్టిల్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి చిత్రాల‌పై ప‌రిణీతి దృష్టి సారించిన‌ట్టు వెల్ల‌డించింది.