Begin typing your search above and press return to search.

కొత్త పెళ్లికూతురు పారీలో ఈ జోష్ చూసారా?

తాజాగా నూతన వధూవరులు పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా తమ వివాహ వేడుక నుంచి మంత్రముగ్ధులను చేసే ఫోటోల బంచ్ ని షేర్ చేసారు

By:  Tupaki Desk   |   26 Oct 2023 10:57 AM GMT
కొత్త పెళ్లికూతురు పారీలో ఈ జోష్ చూసారా?
X

అతడు ఆమె ఒక‌ట‌య్యారు. ఆమెలో ఆనందం ఆవ‌ర్ణ‌మైంది. ఆమె త‌నువు పుల‌కించిపోతోంది. స్నేహితుడే ప్రియుడైతే, ప్రియుడే వ‌రుడైతే ఆ ఆనందం ఏ రేంజులో ఉంటుందో ఇప్పుడు పారి అలియాస్ ప‌రిణీతిని చూసి అర్థం చేసుకోవ‌చ్చు. ఇటీవ‌లే ప‌రిణీతి- రాఘ‌వ్ చ‌ద్దా పెళ్ల‌యిన సంగ‌తి తెలిసిందే. ఇది డెస్టినేష‌న్ వెడ్డింగ్.

తాజాగా నూతన వధూవరులు పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా తమ వివాహ వేడుక నుంచి మంత్రముగ్ధులను చేసే ఫోటోల బంచ్ ని షేర్ చేసారు. ఇవి అభిమానులను ఆనందడోలిక‌ల్లో మునిగిపోయేలా చేస్తున్నాయి. అధికారిక వివాహ ప్రకటన, శక్తివంతమైన హల్దీ ఉత్సవాల ఆల్బమ్ .. వివాహానికి ముందు ఆటలు ఇలా ప్ర‌తిదీ ఫోటోల రూపంలో ఇప్ప‌టికే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పరిణీతి చూరా వేడుక నుండి గుండెల్ని ట‌చ్ చేసే ఫోటోల‌ను షేర్ చేసింది. కుటుంబంతో హృద‌యాల్ని హత్తుకునే క్షణాలకు సంబంధించిన అద్భుత‌మైన‌ ఫోటోగ్రాఫ్స్ ఇవి.

వివాహానికి నాందిగా చూర వేడుక జ‌రుగుతుంది. ఈ వేడుక ఫోటోలు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఈ బంచ్ లో మొదటి ఫోటో పూల శోభతో అల‌రించింది. అక్క‌డ‌ గులాబీలు కురిసే వేళ‌ సూర్యకిరణం గుండెల్ని తాకిన‌ట్టుగా ఆనందం ఆవ‌ర్ణ‌మైంది. ఒక క్లోజ్-అప్ షాట్ క్లిష్టమైన పింక్ చూరాను ప్రదర్శించింది. పరిణీతి సున్నితమైన పింక్ క్లాత్‌తో అలంకరించిన ఫోటో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. ఆమె సోదరులు చేతులకు కలీరాలను కట్టారు. ఆమె స్నేహితుల ఎపిసోడ్ ఆక‌ట్టుకుంటోంది. ఈ బంచ్ లో కుటుంబ స‌భ్యుల‌ చిత్రపటం కూడా ఉంది. పారీ తల్లిదండ్రులు, సోదరులు సంతోషకరమైన వేడుకలో ఒకచోట చేరి సంద‌డి చేసారు.

పరిణీతి చోప్రా -రాఘవ్ చద్దా వివాహానికి సంబంధించి, రాజస్థాన్‌ ఉదయపూర్‌లోని విలాస‌వంత‌మైన‌ హోట‌ల్ సిద్ధ‌మైంది. సెప్టెంబర్ 24న ఈ పెళ్లి జరిగింది. లీలా ప్యాలెస్‌, తాజ్‌ లేక్‌ ప్యాలెస్‌ హోటళ్లలో సంబరాలు అంబరాన్నంటాయి. వివాహానికి ముందు, 90ల నాటి వినోదభరితమైన వేడుకలకు నాస్టాల్జిక్ టచ్‌ని జోడించ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. ఈ జంట వారి కుటుంబాల మధ్య లోతైన అనుబంధాన్ని జోడించే ఆచారాలలో భాగంగా క్రీడలు క‌న్నుల‌పండుగ‌గా సాగాయి. వివాహం జరిగిన ఒక రోజు తర్వాత, రాఘవ్ - పరిణీతి ఢిల్లీకి బయలుదేరారు. అక్కడ కొత్త ఇంటిలో వధువు కోసం గొప్ప బహు స్వాగత్ వేడుక జరిగింది. సాయంత్రం రింగ్-ఫైండింగ్ గేమ్ ... ఎంగేజింగ్ రిలేషన్ షిప్ క్వశ్చన్స్ .. సజీవ సంప్రదాయాలతో పెళ్లి అనంత‌ర వేడుక‌లు వైభ‌వంగా సాగాయి. రాఘవ్ కుటుంబం తనను అద్భుతంగా రిసీవ్ చేసుకుంద‌ని, కొత్త ఇంట్లో రాణిలా అనిపించిందని పరిణీతి బహిరంగంగా త‌న ఆనందం వ్యక్తం చేసింది.