Begin typing your search above and press return to search.

బట్టలు లేకుండా హీరో దర్శనం.. హీరోయిన్ షాక్!

అయితే ఓ ఇంటర్వ్యూలో రణవీర్ సింగ్ కాస్ట్యూమ్స్, వ్యక్తిత్వం గురించి పరిణీతి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Desk   |   26 May 2024 10:30 AM GMT
బట్టలు లేకుండా హీరో దర్శనం.. హీరోయిన్ షాక్!
X

బాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు రణవీర్ సింగ్. దేశంలోనే అత్యధిక బ్రాండ్ వేల్యూ ఉన్న స్టార్స్ లో రణవీర్ సింగ్ టాప్ లో ఉన్నాడు. అతని డ్రెస్సింగ్ స్టైల్, ఆటిట్యూడ్ రెగ్యులర్ హీరోలకి భిన్నంగా ఉంటుంది. సినిమాలో ఏ క్యారెక్టర్ చేస్తే ఆ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఆ క్యారెక్టరైజేషన్ లోనే ప్రమోషన్స్ లో కూడా రణవీర్ ఉంటాడు. అందుకే బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా రణవీర్ సింగ్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

స్టైలిష్ గా ఉండటమే కాకుండా అవసరం అయితే నగ్నంగా కూడా ఫోటోలకి ఫోజులివ్వడానికి రణవీర్ సింగ్ అస్సలు వెనుకాడడు. గతంలో అతని అర్ధ నగ్న ఫోటోలు కొన్ని వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో హీరోయిన్స్ అందరితో రణవీర్ సింగ్ కి మంచి ఫ్రెండ్లీ బాండింగ్ ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా రణవీర్ సింగ్ తో లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్, బ్యాండ్ బాజా భారత్ సినిమాలు చేసింది. ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయి.

తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మూవీస్ రాలేదు. అయితే ఓ ఇంటర్వ్యూలో రణవీర్ సింగ్ కాస్ట్యూమ్స్, వ్యక్తిత్వం గురించి పరిణీతి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రణవీర్ సింగ్ అస్సలు ఒంటి మీద బట్టలు ఉంచుకోడని, పబ్లిక్ లో కూడా ఎలాంటి మొహమాటం లేకుండా డ్రెస్ తీసేసి నిలబడగలడని కామెంట్స్ చేసింది. రణవీర్ ఒక్కో రోజు ఒక్కో రకమైన డిజైనర్ కాస్ట్యూమ్స్ తో వచ్చి ఈ రోజు ఇదే డ్రెస్ అని చెబుతాడు. ఒక్కోసారి ప్యాంట్ వేసుకోకుండా వచ్చేస్తాడు.

ఎవరో ఒకరు ప్యాంట్ వేసుకోమని చెబితే అప్పుడు వేసుకుంటాడు. రణవీర్ మ్యాకప్ వ్యాన్ లోకి వెళ్ళడానికి కూడా నేను ఆలోచించి అనుమతి తీసుకొనే వెళ్తాను. అస్సలు తాను మేకప్ రూమ్ లో ఎలాంటి స్థితిలో ఉంటాడో అంచనా వేయలేం. ఒకసారి అలాగే అడిగి వెళ్లిన ఒంటిపై బట్టలు లేకుండానే నాతో మాట్లాడాడు. అతన్ని బట్టలు లేకుండా చూడటం వలన ఇతరులు ఎవరైనా ఫీల్ అవ్వాలి తప్ప తనకి మాత్రం ఎలాంటి పట్టింపు ఉండదు.

ఎందుకు అలా ఉంటావని అడిగితే నన్ను బట్టలు లేకుండా చూడటం వలన వారి జీవితాలలో ఎలాంటి మార్పులు రావు కదా అని చెబుతాడు. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్లీ బాండింగ్ ఉండటం వలన రణవీర్ ని అలా చూడటం నాకు అలవాటైపోయిందని పరిణీతి చోప్రా చెప్పుకొచ్చింది. నేను అతని గురించి ఇంత ఓపెన్ గా చెప్పినా కూడా రణవీర్ మాత్రం ఏమీ అనుకోడు అంటూ చివర్లో అతని వ్యక్తిత్వం గురించి కూడా పరిణీతి చోప్రా చెప్పడం విశేషం ఆమె వ్యాఖ్యలు బీటౌన్ లో ప్రస్తుతం వైరల్ గా మారాయి. వీటిపై ఎవరైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా అనేది చూడాలి.