బిజీగా లేవంటే? దిమ్మతిరిగే సమాధానమిచ్చింది!
కజిన్ ప్రియాంక చోప్రా బ్రాండ్ ఐడెంటీతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పరిణితి చోప్రా గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 20 April 2024 5:57 AM GMTకజిన్ ప్రియాంక చోప్రా బ్రాండ్ ఐడెంటీతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పరిణితి చోప్రా గురించి చెప్పాల్సిన పనిలేదు. పదేళ్ల క్రితం కెరీర్ ప్రారంభించినా ఇప్పటికీ నత్తనడకనే సాగుతుంది. అమ్మడి కటౌట్ కి అక్కలా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా భావించారు. కానీ ఇండస్ట్రీలో పరిణితి ఆ రేంజ్ కి ఏ దశలోనూ దరిదాపుల్లో కూడా చేరుకోలేదు. చేస్తుంది అంటే సినిమాలు చేస్తుందని చెప్పుకోవడం తప్ప! పరిణితి బ్రాండ్ ఇదని ఏ సినిమాతోనూ ప్రూవ్ చేయలేకపోయింది.
కాస్తో కూస్తో పేరొస్తుంది అనుకున్న సమయంలో ఆప్ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో లవ్...వెడ్డింగ్ కథ తెలిసిందే. ఇటీవలే ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన `అమర్ సింగ్ చమ్ కీలాల` కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాతోనై హిట్ అందుకుంటుందని అంతా భావించారు. కానీ ఓటీటీ రిలీజ్ కి అనుకున్నంతగా రెస్పాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో పరిణితి కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఆమె ముందుకెళ్లాయి.
డే బై డే మీ గ్రాఫ్ మరీ పడిపోతున్నట్లుంది? మునుపటి కంటే ఇప్పుడు బాగా సినిమాలు తగ్గాయి? ఈ జర్నీ ఎలా ఉంది? కెరీర్ ప్లానింగ్ ఏంటి? అని ప్రశ్నించగా దిమ్మతిరిగిపోయే సమాధానం చెప్పింది. ఎవ్వరూ ఊహించని విధంగా పరిణితి సమాధానం ఇక్కడ ఉంది. `నేను పార్టీలకు వెళ్లను..ఈవెంట్లకు హాజరు కాను. పీఆర్ కూడా పెద్దగా లేదు. కమర్శియల సినిమాలు చేయడం తెలిసినట్లైతే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయే దాన్ని.
అలాగని నేను సంతోషంగా లేనని కాదు. నేనిప్పుడు చేతిలో ఉన్న అవకాశాలతో చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితం ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను అనుకున్నది సాధించాను` అని అనుకుంటున్నాను అంది. గత రెండేళ్ల కాలంగా పరిణితి కేవలం రెండు సినిమాలే చేసింది. అంతకు ముందు ఒకే ఏడాది రెండు..మూడు సినిమాలు చేసింది. చివరి సినిమాతో తనలో గాయనిని కూడా బయట పెట్టింది. ఈ నేపథ్యంలో గాయనిగా కొనసాగుతుందా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి.