మరదలితో మాల్దీవులకు..ఇదేం హనీమూన్!
ప్రస్తుతం పరిణితి చోప్రా మాల్దీవుల్లో మరదలితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. 'నేను హానిమూన్‌కు వెళ్లలేదు. ఈ ఫోటోను నా మరదలు తీసింది. ఇది గర్ల్స్ ట్రిప్'
By: Tupaki Desk | 17 Oct 2023 7:01 AM GMTపెళ్లైన కొత్త దంపతులు ఎవరైనా జంటగా వెకేషన్ కి వెళ్తారు. ఓ వారం..పది రోజుల..నెల రోజుల పాటు రెండు కుటుంబాలకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆస్వాదన కోరుకుంటారు. ఆ తర్వాత మళ్లీ యధా విధిగా ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అవుతున్నారు. కానీ ఇలా పెళ్లైన కొన్ని రోజులకే మరదలితో వెకేషన్ కి వెళ్లిన నటిని మాత్రం పరిణితి చోప్రానే అవుతుందేమో. అవును ఇప్పుడీ మ్యాటర్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవలే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా-పరిణితి చోప్రా వివాహం రాజస్థాన్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రేమ బంధానికి పుల్ స్టాప్ పెట్టి వివాహ బంధంతో ఒకటయ్యారు. అయితే ఈ జంట హనీమూన్ కివ వెళ్లినట్లు లేదు.
ప్రస్తుతం పరిణితి చోప్రా మాల్దీవుల్లో మరదలితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ‘నేను హానిమూన్‌కు వెళ్లలేదు. ఈ ఫోటోను నా మరదలు తీసింది. ఇది గర్ల్స్ ట్రిప్’ అంటూ బికినీలో ఉన్న ఒక ఫోటో షేర్ చేసింది.
ఆమె చేసిన పోస్ట్ చూసిన అభిమానులు నెటిజన్లు 'మరదలితో హనిమూన్ ఏంటి..? కొత్తగా పెళ్లైన వారు జంటగా వెళ్తే ఆ మధుర క్షణాలు చెప్పలేనివి’ అని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు పెళ్లై నెల కాలేదు భర్తతో కాకుండా మరొకరితో హనిమూన్ ఎంజాయ్ చేస్తున్నావా! అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మరికొంత మంది భర్తని ఫోటోల్ని హైడ్ చేస్తుందని అంటున్నారు.
రాఘవ్ చద్దా రాజకీయ నాయకుడు కాబట్టి ఇలాంటి ఫోటోలు బయటకు వస్తే ప్రజాక్షేత్రంలో ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుం ది. అందుకే భర్తని దాచి పెట్టి తాను మరదలితో మాత్రమే ట్రిప్ కి వెళ్లినట్లు చెబుతుందంటున్నారు. ఇది వాస్తవమే. యాక్టివ్ లో ఉన్న ఎంపీ ఇన్నర్ వేర్స్ లో కనిపిస్తే ట్రోలింగ్ బారిన పడక తప్పదు. స్వేచ్ఛగా విహరించే స్వేచ్ఛ సెలబ్రిటీలకు ఉన్నంతగా మిగతా వారికి ఉండదు అన్నది వాస్తవం. సెలబ్రిటీలపై ఎలాంటి రూమర్లు వచ్చినా! అమి పెద్దగా హైలైట్ కావు. అవి నిజమైనా.. అబద్దమైనా లైట్ తీసుకోవడం అన్నది వాళ్ల జీవితాల్లో చాలా సహజంగా చోటు చేసుకుంటుంది.