YRF లో ఉద్యోగం నుంచి హీరోయిన్ గా!
ఈ క్రమంలోనే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతోనూ ప్రేమలో పడడటం..వివాహం సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 May 2024 1:30 AM GMTబాలీవుడ్ లో పరిణితి చోప్రా కెరీర్ ప్రస్తానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ గా ఎంట్రీ ఇచ్చినా! ఆమె ఎదుగుదలలో పీసీ ఏమాత్రం సహకరించలేదు. పరిణితి సొంత ట్యాలెంట్ తోనే ఎదిగింది. పదేళ్ల సినీ ప్రస్తానంలో ఎన్నో సినిమాలు చేసింది. 'లేడీస్ వర్సెస్ రికీ భాయ్' తో పరిచయమైన అమ్మడు 'అమర్ సింగ్ చంకీలా' వరకూ ఎన్నో సినిమాలు చేసింది. నటిగా తనకంటూ ప్రత్యకమైన గుర్తింపును దక్కించుకుంది.
ఈ క్రమంలోనే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతోనూ ప్రేమలో పడడటం..వివాహం సంగతి తెలిసిందే. అయితే పరిణితి సినిమాల్లోకి రావడం అన్నది యాదృశ్చింగా జరిగింది. తొలుత సినిమాలంటే ఆమెకి పెద్దగా ఆసక్తి లేదుట. విదేశాల్లో చదువు..అటుపై మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉద్యోగం..లక్షల్లో సంపాదన. ఇలా హ్యాపీగా సాగిపోతుంది. సినిమా అనే ఆలోచనే లేదు. అయితే 2009 ఆర్దిక మాంద్యం కారణంగా బ్రిటన్ నుంచి ఇండియాకి తిరిగొచ్చింది.
ఆ సమయంలో యశ్ రాజ్ ఫిలింస్ లో జాయిన్ అయింది. అందులో పబ్లికి రిలేషన్స్ కన్సల్టెంట్ గా ఉద్యోగం చేసేది. అదే అమ్మడి కెరీర్ ని మలుపు తిప్పిందని తెలిపింది. 'చదివిన చదువుకి ...చేస్తోన్న ఉద్యోగం కూడా సింక్ అయింది. అప్పుడే 2010లో 'బ్యాండ్ భాజా భారత్' ప్రచారంలో పాల్గొన్నా. అప్పుడే నటి కావాలి అన్న ఆకాంక్ష మొదలైంది. దీంతో ఆ ఉద్యోగం చేయలేకపోయాను. వైఆర్ ఎఫ్ కాస్టింగ్ డైరెక్టర్ ని కలిస్తే డమ్మీగా ఓ ఆడిషన్ ఇమ్మన్నారు.
'జబ్ ఉయ్ మెట్ 'లో చిన్న బిట్ చేసాను. ఆ తర్వాత ఆ విషయం మరిచిపోయాను. ఆవీడియో ఆదిత్య చోప్రా చూసి కలమని కబురు పంపారు. అది ఆయనకు బాగా నచ్చిందట. వెంటనే ఆయన మూడు సినిమాలకు సైన్ చేయించారు. అలా సినిమా జీవితం ప్రారంభమవ్వడానికి పరిస్థితులు సహకరించాయి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డులతో గుర్తింపు దక్కింది' అని తెలిపింది.