హీరోయిన్ కొత్త జర్నీ..ఇది ఎవరూ ఊహించనిది!
ఈ నేపథ్యంలో పరిణితి కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి రెడీ అవుతుంది. ఇప్పటివరకూ నటిగా మెప్పించిన అమ్మడు ఇకపై గాయనిగాను శ్రోతల్ని అల రించడానికి రెడీ అవుతుంది.
By: Tupaki Desk | 27 Jan 2024 4:30 PM GMTప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పరిణితి చోప్రా జర్నీ ఎలా సాగుతుందో తెలిసిందే. అక్క తరహాలో అమ్మడు బాలీవుడిలో ఓ వెలుగు వెలగాలని ఎన్నో ఆశలతో జర్నీ ప్రారంభిం చింది. కానీ అమ్మడు జర్నీ ఆవిధంగా సాగలేదు. సినిమాలైతే చేస్తుందుగానీ అమ్మడు ఇప్పటికీ స్టార్ లీగ్ లో చేరలేదు. దశాబ్ధ కాలంగా కెరీర్ ఇలాగే సాగుతుంది. ఈనేపథ్యం లోనే ఇటీవలే రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దాని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
అతడితో ఒక్కసారిగా ప్రేమ..పెళ్లి అంటూ కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం భర్తకి కావాల్సి నంత స్పేస్ కేటాయిస్తూనే సినిమాలు చేస్తోంది. అలాగని బాలీవుడ్ లో బిజీగా సినిమాలు చేయలేదు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో పరిణితి కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి రెడీ అవుతుంది. ఇప్పటివరకూ నటిగా మెప్పించిన అమ్మడు ఇకపై గాయనిగాను శ్రోతల్ని అల రించడానికి రెడీ అవుతుంది.
ఈ జర్నీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సంగీత ప్రపంచం ఓ సంతోషకరమైన ప్రపంచం. ఎన్నో వేదికలపై ఎంతో మంది సంగీత కళాకారుల్ని చూసాను. ఇప్పుడిదే ప్రపంచంలోకి నేను భాగమయ్యేందుకు సమయం ఆసన్నమైంది. నా జీవితంలో కొత్త అద్యాయం ప్రారంభంకాబోతున్నందుకు సంతోషంగా ఉన్నాను ' అని తెలిపింది. దీంతో పరిణితి వ్యాఖ్యల్ని బట్టి హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతోనే గాయని గా కొత్త ప్రయాణం మొదలు పెడుతుందా? అన్న సందేహం రాకమానదు.
హీరోయిన్ గా బిజీగా ఉంటే ఇప్పటికిప్పుడు గాయని నిర్ణయం తీసుకోవడానకి అవకాశమే లేదు. గత ఏడాది పరిణితి కేవలం ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అదే 'మిషన్ రాణిగంజ్' . భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఇక కొత్త సంవత్సరంలో 'అమర్ సింగ్ చంకీ లాల' తో మెప్పించడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కానీ ఇప్పుడే స్టేజ్ లో ఉందో కూడా తెలియదు.