పెళ్లికి ముందే ఆ జంట ప్రత్యేక పూజలు!
బాలీవుడ్ హీరోయిన్ పరిణితో చోప్రా- ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 Aug 2023 4:55 PM GMTబాలీవుడ్ హీరోయిన్ పరిణితో చోప్రా- ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ జంట నిశ్చితార్దం ఘనంగా జరిగింది. కాలేజీ రోజుల్లోనే మొదలైన ప్రేమ చాలా కాలం పాటు గోప్యంగానే ఉంచారు. చివరిగా ఇద్దరు జీవితంలో స్థిరపడటంతో వివాహబంధంతో ఒకటవ్వాలని నిశ్చయించుకున్నారు. సెప్టెంబర్ 25న అంగరంగ వైభవంగా వివాహం జరగనుంది.
అయితే ఈ జంట పెళ్లికి ముందే దేవాలయాలు చుట్టేస్తున్నారు. ఇప్పటికే అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి శ్రీ హర్మందిర్ సాహిబ్ లో ప్రత్యేక పూజలు చేశారు. వాటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఉజ్జయిని లోని మహకాలేశ్వర ఆలయం లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కాబోయే వధువరూలిద్దరు ప్రత్యేక వస్త్రాలు ధరించి ఆలయంలో పూజలు నిర్వహించారు.
వెంట కుటుంబ సభ్యులున్నారు. ఇలా వరుసగా పూజలు నిర్వహించడంతో దోష నివారణకి సంబంధిం చిన పూజలు ఏమైనా చేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వివాహం తేది దగ్గర పడుతోన్న సమయంలోనే ఇలా కనిపించడంతో సందేహాలు బలపడుతున్నాయి. ప్రస్తుతం నెట్టింట పూజ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక పరిణితి కెరీర్ పరంగా చూస్తే బాలీవుడ్ లో జర్నీ సాగిస్తుంది.
ప్రియాంక చోప్రా కజిన్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పరిణితి కెరీర్ మరింత పీక్స్ లో లేదు. నెమ్మదిగానే సాగుతుంది. అమ్మడికి ఇంకా రావాల్సినంత గుర్తింపు రాలేదు. తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చినా నటించడానికి రెడీగా ఉంది. ఇంతలోనే ప్రేమ..పెళ్లి అంటూ మీడియాలో హైలైట్ అయింది. మరి వివాహం తర్వాత పరిణితి సినిమాలు చేస్తుందా? లేదా? అన్నది చూడాలి. భర్త రాజకీయ నాయకుడు. ఆప్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇలా ఇద్దరు ప్లాట్ పామ్స్ వేర్వేరు. ఈ నేపథ్యంలో పరిణితి వివాహం తర్వాత కుటుంబ జీవితానికే అంకితమవుతుందని పలువురు భావిస్తున్నారు.