Begin typing your search above and press return to search.

త‌ప్పుడు స‌ల‌హాలు విని న‌ష్ట‌పోయాన‌న్న న‌టి!

ఇండ‌స్ట్రీలో నైట్ పార్టీల‌కు అటెండ‌యితేనే అవ‌కాశాలొస్తాయా? అంటే అవున‌నే చాలా మంది క‌థానాయిక‌లు అంగీక‌రిస్తారు.

By:  Tupaki Desk   |   19 April 2024 5:36 AM GMT
త‌ప్పుడు స‌ల‌హాలు విని న‌ష్ట‌పోయాన‌న్న న‌టి!
X

ఇండ‌స్ట్రీలో నైట్ పార్టీల‌కు అటెండ‌యితేనే అవ‌కాశాలొస్తాయా? అంటే అవున‌నే చాలా మంది క‌థానాయిక‌లు అంగీక‌రిస్తారు. ముఖ్యంగా హిందీ చిత్ర‌సీమ‌లో లేట్ నైట్ పార్టీలు, కాక్ టైల్ పార్టీల వెన‌క చాలా క‌థ‌లే న‌డుస్తాయ‌ని చెబుతుంటారు. ఈ పార్టీల‌ను కంగ‌న ర‌నౌత్ - ప్రియాంక చోప్రా లాంటి ప‌లువురు అగ్ర నాయిక‌లు నిరంత‌రం తూర్పార‌బ‌డుతూనే ఉన్నారు. తాము పార్టీలకు వెళ్ల‌క‌పోవ‌డం వ‌ల్ల కెరీర్ ప‌రంగా చాలా న‌ష్ట‌పోయామ‌ని వారు ప‌లు ఇంట‌ర్వ్యూల్లో వెల్ల‌డించారు.


ఇప్పుడు ఇదే జాబితాలో చేరింది ప‌రిణీతి చోప్రా అలియాస్ పారి. ఈ పంజాబి బ్యూటీ 2011 నుండి బాలీవుడ్‌లో భాగమైంది కానీ పరిమిత సినిమాలే చేసింది. దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని ఇప్పుడు వివరించింది. బాలీవుడ్ లోని చీకటి కోణాన్ని తాజా ఇంట‌ర్వ్యూలో బహిర్గతం చేసింది పారి. ఇక్క‌డ‌ సామాజిక సమావేశాలు, పార్టీల సమయంలో నటీమణులకు పాత్రలు లభిస్తాయని ప‌రిణీతి పేర్కొంది.

పరిణీతి చోప్రా ప్రస్తుతం అమ‌ర్ సింగ్ చ‌మ్కీలా విజ‌యాన్ని ఆస్వాధిస్తోంది. ఇంతియాజ్ అలీ తెర‌కెక్కించిన `అమర్ సింగ్ చమ్కిలా`లో దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటంచ‌గా, పారి అత‌డి ప్రియురాలిగా న‌టించింది. ఈ బ్యూటీ తన నటనకు మంచి సమీక్షలను అందుకుంది. చాలా మంది అభిమానులు పారీ ఈ సినిమాతో తిరిగి ఏ లిస్ట‌ర్‌లో చేరింద‌ని ప్రకటించారు. అయితే త‌న కెరీర్ లో ఏం తప్పు జరిగింది? అని మీడియా ప్ర‌శ్నించ‌గా పారీ దీనిపై స్పందించింది. ప‌రిణీత్ చోప్రా స్పందిస్తూ, ``నాకు చాలా సమస్య ఉంది.. అది నా PR గేమ్ ప‌రంగా వెన‌క‌బాటు. నేను PRలో చాలా చెత్త‌. సరైన స‌మ‌యంలో సరైన లంచ్‌లు, డిన్నర్‌లలో అవకాశాలు క్రియేట్ అవుతాయ‌ని తెలిసిన‌ప్పుడు.. ఈ ఈవెంట్‌లలో ప్రాజెక్ట్‌ల సృష్టి జ‌రుగుతుంద‌ని తెలిసిన‌ప్పుడు... అవేవీ నేను ప‌ట్టించుకోలేదు.. నేను ఆ ఈవెంట్‌లలో లేను`` అని పారి తెలిపింది.

ఫేక్ రిలేషన్ షిప్ క్రియేట్ చేయడంలో పరిణీతి చోప్రా త‌న‌కు నమ్మకం లేదని కూడా అంది! ప‌రిణీతి నిజ‌జీవితంలో నటించడంలో చేత‌కానిదానిని అని అంగీక‌రించారు. తన అంకితభావం, కృషి వల్ల అవ‌కాశాలొస్తాయ‌నే నమ్మకం ఉందని చెప్పింది. అనవసరమైన సంబంధాలను ఏర్పరచుకోవడంలో నేను చాలా చెత్త‌. నేను క‌నెక్ట్ కాలేను అని తెలిపింది. అయితే పార్టీల‌తో కునుకుపాట్లు ప‌డే న‌టీమ‌ణుల‌పైనా త‌నదైన శైలిలో పారి విరుచుకుప‌డింది. మంచి పని కోసం మాత్ర‌మే తనను సంప్రదించాలని దర్శకులు, నిర్మాతలను పారి కోరారు.

వ్యక్తిగత విషయానికి వస్తే.. పరిణీతి ఇటీవల రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దాని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. పారి న‌టించిన `చ‌మ్కీలా` చిత్రం పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని రాఘ‌వ్ తొలినుంచి అనేవార‌ని పారి ఇటీవ‌లి ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.