'వందే భారత్' లో ఆహారం... నటుడు-దర్శకుడి ట్వీట్ వైరల్!
ఈ విషయంలో ఎవరికి వారే ఓ తిట్టుతిట్టుకుని కిటికీలోంచి బయటకు పాడేస్తారే తప్ప ఫిర్యాదు చేసేవారు తక్కువని అంటుంటారు.
By: Tupaki Desk | 16 Oct 2024 3:49 AM GMTభారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ రైల్వే సేవలు అద్భుతం అని కొనియాడాల్సిందే! అయితే.. ఈ ట్రైన్స్ లో వడ్డించే ఆహారం విషయంలో మాత్రం నిత్యం ఫిర్యాదులు అందుతూనే ఉంటాయని అంటారు. ఈ విషయంలో ఎవరికి వారే ఓ తిట్టుతిట్టుకుని కిటికీలోంచి బయటకు పాడేస్తారే తప్ప ఫిర్యాదు చేసేవారు తక్కువని అంటుంటారు.
ఈ క్రమంలో వందే భారత్ లో పర్యటిస్తూ, ట్రైన్ లో ఆహారం రుచి చూసిన అనుభవాన్ని తాజాగా పంచుకున్నారు నటుడు, దర్శకుడు పార్తిబన్. ఈ మేరకు ఎక్స్ లో ఈ విషయాన్ని వెళ్లడించారు. దీంతో... ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారగా... వందేభారత్ కూడా భారతీయ రైల్వేలో భాగమే కదా అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారని తెలుస్తోంది!
వివరాళ్లోకి వెళ్తే... ఈ నెల 13న చెన్నై నుంచి కోయంబత్తూర్ వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించారట నటుడు - దర్శకుడు రాధాకృష్ణన్ పార్థిబన్. ఈ సమయంలో తనకు సరఫరా చేయబడిన ఆహారం నాణ్యత తక్కువగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. తనకు వడ్డించిన ఆహారంలో నాణ్యత లేదని ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
తాను ప్రయాణించిన రైల్ లో ఫుడ్ సర్వర్ల సేవలు బాగున్నాయని.. అయితే రాత్రి తనకు వడ్డించిన ఆహారం మాత్రం అధ్వాన్నంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయాలపై... ఆహారంలో నాణ్యత లేదని, ఇది ప్రయాణికులకు ఉపయోగపడదని ఫిర్యాదు పుస్తకంలో కూడా రాసినట్లు పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు పుస్తకంలో రాసినదాన్నే ఫోటో తీసి ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు!
ఈ నెపథ్యంలో... పార్థిబన్ పోస్ట్ పై పలువురు స్పందిస్తున్నారు. ప్రజలకు మంచి జరగాలంటే ఎవరైనా ముందుకు రావాలని.. ఈ విషయంలో మీరు మంచి పని చేశారంటూ పలువురు మెచ్చుకుంటున్నారు. ఈ సమయంలో.. ఆయనకు కలిగిన అసౌకర్యంపై రైల్వే మేనేజ్మెంట్ స్పందించింది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది.
ఈ విషయంపై స్పందించిన సేలం రైల్వే డివిజన్ అధికారులు.. ఈ వ్యవహారంపై ఫుడ్ కాంట్రాక్టర్ నుంచి సంజాయిషీ కోరి తగిన చర్యలు తీసుకుంటామని, ఇకపై నాణ్యమైన ఆహార పదార్ధాలు అందిస్తామని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది!