Begin typing your search above and press return to search.

అనసూయ అందుకే హీరోయిన్ అవ్వలేకపోయిందా..?

జబర్దస్త్ యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ ఆ క్రేజ్ తోనే సినిమా ఛాన్స్ లు అందుకుంది.

By:  Tupaki Desk   |   5 Nov 2023 4:55 AM GMT
అనసూయ అందుకే హీరోయిన్ అవ్వలేకపోయిందా..?
X

జబర్దస్త్ యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ ఆ క్రేజ్ తోనే సినిమా ఛాన్స్ లు అందుకుంది. సినిమాల్లో చేస్తున్న పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది అనసూయ. స్మాల్ స్క్రీన్ వదిలేశాక కాస్త దూకుడు తగ్గిందని అనిపించినా వస్తున్న పాత్రలతో అనసూయ కెరీర్ సంతృప్తికరంగా ఉన్నదని చెబుతుంది. ఈమధ్య ప్రతి సినిమాలో అనసూయ కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇచ్చిన ఎలాంటి పాత్రలైనా కూడా ఫుల్ ఎఫర్ట్ పెట్టి మెప్పిస్తుంది అనసూయ.

హీరోయిన్ గా తనకు అవకాశాలు ఎందుకు రాలేదో చెప్పుకొచ్చింది అనసూయ. షూటింగ్ తర్వాత పార్టీలకు వెళ్లను అందుకే హీరోయిన్ గా అవకాశాలు రాలేదని అంటుంది అనసూయ. షూటింగ్ తర్వాత నైట్ పార్టీలు జరుగుతుంటాయి కానీ అలాంటివి తనకు అసలు ఇష్టం ఉండదు. అందుకే అలాంటి పార్టీలకు తను దూరంగా ఉంటాయని ఆ పార్టీలకు వెళ్లినట్టైతే తనకు కూడా హీరోయిన్ గా అవకాశాలు వచ్చేవని చెబుతుంది అనసూయ.

హీరోయిన్ కావాలంటే పార్టీలకు తప్పనిసరిగా అటెండ్ అవ్వాలన్నట్టుగా అనసూయ చెబుతుంది. ఇక తనకు అత్తారింటికి దారేది సినిమా ఆఫర్ వచ్చినా నలుగురిలో ఒకరు అన్నట్టుగా చేయాలని లేకనే ఆ ఆఫర్ వద్దన్నానని కాకపోతే పవర్ స్టార్ సినిమానే కాదంటావా అని సోషల్ మీడియాలో తనని ట్రోల్స్ చేశారని చెప్పుకొచ్చింది అనసూయ. తన మనసుకి నచ్చింది చేస్తానని నచ్చకపోతే చేయనని అంటుంది.

తన కెరీర్ సంతృప్తికరంగా ఉందని అయితే ఇదివరకులా పాత్ర ప్రాధాన్యత ఉంటేనే కాకుండా వచ్చిన పాత్రకు తన మార్క్ నటనతో మెప్పించేలా చేస్తానని అంటుంది అనసూయ. సినిమాలతో పాటు వివాదాల్లో కూడా అనసూయ హాట్ టాపిక్ గా ఉంటుంది. డైరెక్ట్ గా ఒక యువ హీరోతో అనసూయ ట్వీట్ల యుద్ధం తెలిసిందే. అయితే ఈమధ్యనే ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. కంటెంట్ ఉన్న సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ కెరీర్ ని సూపర్ స్ట్రాంగ్ చేసుకుంటుంది అనసూయ.

నటిగా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు ఎలాంటి పాత్రలకైనా సిద్ధమే అని చెబుతుంది అనసూయ.యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న అనసూయ ఛాలెంజింగ్ రోల్స్ చేయడం అంటే ఇష్టమని చెబుతుంది. ప్రతి సినిమాలోని తన పాత్రతో మెప్పిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది అమ్మడు.