Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్..చిరంజీవి లా ప‌వ‌న్ ఎదిగేవారు!

సీనియ‌ర్ ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. 'పవన్ కల్యాణ్ బాగుండాలని కోరుకునేవారిలో నేను ఒక‌డిని.

By:  Tupaki Desk   |   10 Aug 2023 8:04 AM GMT
ఎన్టీఆర్..చిరంజీవి లా ప‌వ‌న్ ఎదిగేవారు!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా కెరీర ప్రారంభించి రెండున్న‌ర ద‌శాభ్దాల‌వుతుంది. ఇన్నేళ్ల‌లో ఆయ‌న కేవ‌లం 30కి పైగానే సినిమాలు చేసారు. 'అక్కడ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయ్' నుంచి తాజా ప్రాజెక్ట్ 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' ని క‌లుపుకుంటే తేలిన లెక్క అది. కేవ‌లం ప‌వ‌న్ ఏడాదికి ఒక్క సినిమా చేసుకుంటూ రావ‌డం వ‌ల్ల ఇన్ని త‌క్కువ సినిమాలు చేయ‌గ‌లిగారు. ఒక‌టి రెండేళ్ల‌లో రెండు సినిమాలు చేసారు త‌ప్ప‌! అంత‌కు మించి ప‌వ‌న్ వేగం ఎక్క‌డా క‌నిపించ‌దు.

అయితే ఈ మధ్య రాజకీయాల్లో బిజీ అయిన త‌ర్వాత సినిమాల వేగం కాస్త పెంచారు. అది కూడా అనివార్య కార‌ణాల వ‌ల్ల డ‌బ్బు అవ‌స‌రం ఏర్ప‌డ‌టంతోనే సినిమాలు స్పీడ్ పెంచిన‌ట్లు చెప్పొచ్చు. ఆర‌కంగా అభిమానుల కోరిక కొంత వ‌ర‌కూ నెర‌వేరుతుంది.

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన త‌ర్వాత పీకే సినిమాల‌కు రిటైర్మెంట్ ఇచ్చేస్తార‌ని..రెండు ప‌వ‌డ‌ల ప్ర‌యాణం అంత శ్రేయ‌స్క‌రం కాద‌ని భావించి ప‌వ‌న్ జ‌న‌సేన తో ప్ర‌జ‌ల సేవ‌కే అంకిత‌మ‌వుతార‌ని ఆయ‌న స‌హా చాలా మంది భావించారు.

కానీ ప‌వ‌న్ వ‌దిలేద్దాం అన్నా..ప‌రిశ్ర‌మ ఆయ‌న్ని వ‌ద‌ల‌డం లేదు. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ జర్నీని ఉద్దేశించి సీనియ‌ర్ ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. 'పవన్ కల్యాణ్ బాగుండాలని కోరుకునేవారిలో నేను ఒక‌డిని. పవన్ సినిమాలు ఆప‌కూడ‌దు. ఇలాగే కొన‌సాగించాలి. స‌మ‌యం లేక‌పోతే సీనియ‌ర్ ఎన్టీఆర్ లా అప్పుడ‌ప్పుడైనా సినిమాల్లో క‌నిపించాలి.

ఆయ‌న సినిమాలు గ్యాప్ లేకుండా ఎక్క‌వ సినిమాలు చేసిన‌ట్లు అయితే ఇప్ప‌టికే ఎన్టీఆర్..చిరంజీవిలా ప‌దిహేన‌ళ్ల‌కే ఇంకా ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకునేవారు. కానీ ఆయ‌న గ్యాప్ కొంత‌వ‌ర‌కూ వెన‌క్కి లాగుతుంది. ప్ర‌జ‌ల్లో..ప్రేక్ష‌కుల్లో ఎంతో బ‌ల‌మైన న‌టుడు. సినిమాలు ఆప‌కూడ‌దు.ఆయ‌న కోరుకున్న రంగంతో పాటు సినిమాలు కొన‌సాగించాలి. స‌మాజం మారాల‌ని..అధికారం ఒక‌రి చేతుల్లోనే ఉండ‌కూడ‌ద‌ని పాటు ప‌డుతున్నారు. ఇక ప‌వ‌న్ న‌టించిన బ్రో సినిమా సాయితేజ్ ప్ర‌మోష‌న్ కోసం చేసిన‌ట్లు ఉంది' అని అన్నారు.