Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్ కి పరుచూరి షాకింగ్ రివ్యూ..!

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బాగానే నడిపించిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పాడని.. సెకండ్ హాఫ్ లో ఒక పావు గంట సినిమా ట్రిం చేసి ఉంటే సినిమా వేరేలా ఉండేదని అన్నారు.

By:  Tupaki Desk   |   1 Jun 2024 10:04 AM GMT
ఫ్యామిలీ స్టార్ కి పరుచూరి షాకింగ్ రివ్యూ..!
X

ప్రముఖ రచయిత పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి పలుకులు అంటూ రిలీజైన సినిమాల మీద తన అభిప్రాయాలను పంచుకుంటారు. స్టార్ సినిమా నుంచి యువ హీరోల సినిమాల వరకు పరుచూరి రివ్యూ ఇస్తుంటారు. లేటెస్ట్ గా పరుచూరి గోపాలకృష్ణ విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బాగానే నడిపించిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పాడని.. సెకండ్ హాఫ్ లో ఒక పావు గంట సినిమా ట్రిం చేసి ఉంటే సినిమా వేరేలా ఉండేదని అన్నారు.

పరుచూరి పలుకులు కార్యక్రమంలో లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ని విశ్లేషించారు పరుచూరి గోపాలకృష్ణ. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను పరశురాం డైరెక్ట్ చేయగా సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. సినిమా గురించి విశ్లేషించిన పరుచూరి ఫ్యామిలీ స్టార్ ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామా.. ఈగో కలిగిన ఒక అమ్మాయి అబ్బాయికి మధ్య అనుబంధం ఏర్పడితే అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అన్నది ఈ సినిమా కథ.

కుటుంబ భారమంతా మోసే హీరో ఇంటిపైన అద్దెకు దిగుతుంది హీరోయిన్. వీళ్లిద్దరు తెలియకుండానే దగ్గరవుతారు. ఐతే వాళ్లిద్దరు ఒక చోట కనెక్ట్ అవ్వడం.. ఈగో వల్ల గొడవలు అవ్వడం ఇదే ఊహించుకునేలా చేశారు దర్శకుడు. అంతేకాదు హీరోని సినిమాలో పీనాసి వాడిలా చూపించారు. అతని అతి జాగ్రత్త వల్ల అలా కనిపిస్తాడు. ఈ సినిమా కథ భాగాలుగా విభజిస్తే హీరోయిన్ వచ్చిన తర్వాత ఆమెకో కథ. తర్వాత మరో కథ ఇలా చాలా కథలు ఉన్నాయని అన్నారు పరుచూరి.

సినిమా ఆశించిన స్థాయి కలెక్షన్స్ తీసుకురాలేకపోవడం వెనక కారణం హీరో బాడీ లాంగ్వేజ్ కు యూత్, లవ్ ఫీల్ ను మించి యాక్షన్ హీరోగా చూపించారు. హీరో ఇమేజ్ కన్నా ఫైట్స్ ఎక్కువ పెట్టి మూవీ దెబ్బతినేలా చేశారని అభిప్రాయపడ్డారు పరుచూరి. ఇంటర్వెల్ వరకు ఒక ఫీల్ గుడ్ మూవీగా తీసుకెళ్లిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో మళ్లీ హీరోయిన్ ఆఫీస్ లో పని చేయడం.. హీరో ఫ్యామిలీకి ఆమె సాయం చేయడంతో హీరోయిన్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. హీరోని హీరోయిన్ అపార్ధం చేసుకుని దూరమైన ప్రేమకథలు ఎక్కువగానే హిట్ అవుతాయి. కానీ ఈగోతో హీరోయిన్ ను దూరం చేసుకోవడం ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే గ్రిప్ తగ్గిందని అన్నారు పరుచూరి.

అంతేకాదు విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ కు మించి క్లైమాక్స్ లో 50, 60 మందిని కొట్టడం ఆడియన్స్ ఆమోదిస్తున్నారేమో తెలియదు కానీ పాత సినిమాలో జరిగిన వాటిని దాటేసి లా తీస్తున్నారని అన్నారు. సినిమా అక్కడక్కడ మాత్రమే బాగోలేదు. సెకండ్ హాఫ్ లో ఒక పావు గంట తీసేసి ఉంటే సినిమా ఇంకో రకంగా ఉండేదా అన్నది తన భావన అని చెప్పారు. విజయ్ దేవరకొండ లవర్ బాయ్ అతన్ని దృష్టిలో పెట్టుకుని కథ రాసేటప్పుడు ఆడిటోరియానికి సరిపోయేలా ట్రీట్ రాస్తే ఆ సినిమాలు ఎక్కువ హిట్ అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు పరుచూరి గోపాలకృష్ణ.