కల్కి, దేవర.. పరుచూరి వారి పలుకులు
అందులో టాలీవుడ్ కు చెందిన కల్కి 2898 ఏడి మరియు ఎన్టీఆర్ దేవర సినిమాలు మొదటి వరుసలో ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
By: Tupaki Desk | 30 May 2024 2:45 AM GMTతెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలు ప్రస్తుతం చాలా ఉన్నాయి. అందులో టాలీవుడ్ కు చెందిన కల్కి 2898 ఏడి మరియు ఎన్టీఆర్ దేవర సినిమాలు మొదటి వరుసలో ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఆ సినిమాల గురించి మాట్లాడారు. గతంలో చాలా మంది హీరోలు ఏడాదికి అయిదు నుంచి పది పన్నెండు సినిమాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బడ్జెట్ భారీగా పెరగడం వల్ల సినిమాల సంఖ్య చాలా తక్కువ అయ్యింది.
భారీ బడ్జెట్ తో కల్కి సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతుంది. ఇందులో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబచ్చన్ తో పాటు ఇంకా పలువురు ప్రముఖులు నటించడం వల్ల సినిమా స్థాయి మరింతగా పెరిగింది. ప్రభాస్ ను వర్షం నుంచి చూస్తున్నాను.
ఆరు అడుగులు ఉంటాడు కానీ, చిన్న పిల్లాడి మనస్తత్వం. అలాంటి ప్రభాస్ నటించిన సినిమా కల్కి అవ్వడం ఆనందం కలిగిస్తుంది. కమల్, అమితాబచ్చన్ లను సింగిల్ షాట్ లో చూస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. అది కల్కి సినిమా స్థాయిని పెంచుతుంది అన్నారు.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న దేవర సినిమా గురించి పరుచూరి వారు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ను చూసిన విధానంతో పోల్చితే ఈ సినిమాలో చాలా విభిన్నంగా కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. దేవర సినిమా పై చాలా ఆసక్తి పెరిగిందన్నారు.
కల్కి మరియు దేవర సినిమాలు ఖచ్చితంగా తెలుగు సినిమా స్థాయిని, ఖ్యాతిని మరింతగా పెంచుతాయి అనే నమ్మకం కలుగుతుందని పరుచూరి వారు చెప్పుకొచ్చారు. కల్కి సినిమా వచ్చే నెల చివరి వారంలో విడుదల అవ్వబోతుండగా, దేవర సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నారు.