సుమంత్ సినిమాపై పరుచూరి రివ్యూ!
ఈ నేపథ్యంలో తాజాగా ఈసినిమా గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ కూడా రివ్యూ చేసారు. సుమంత నటన బాగుందన్నారు. సునిల్ శెట్టి నటించిన యాగన్ సినిమాతో ఈ చిత్రాన్ని పోల్చారు.
By: Tupaki Desk | 17 Aug 2024 6:07 AM GMTసుమంత్ సెలక్టివ్ గా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. మంచి కథ పాత్ర దక్కితో హీరోగా నటిస్తు న్నాడు. లేదంటే ఇతర హీరోల చిత్రాల్లో మంచి పాత్రలు ఆఫర్ చేస్తే నో చెప్పకుండా నటిస్తున్నాడు. కొంత కాలంగా సుమంత్ జర్నీ ఇలాగే సాగుతుంది. తాజాగా ఇటీవలే ప్రశాంత్ సాగర్ దర్శకత్వంలో 'అహం రీబూట్' అనే సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చేసాడు. కానీ ఇది నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయింది.
థియేటర్ రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమా గురించి జనాలకు పెద్దగా తెలియలేదు. అయితే ఈ సినిమాకి మాత్రం మంచి రివ్యూలు వచ్చాయి. కాస్త ఓపికగా చూస్తే మంచి థ్రిల్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ అవుతుందని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ కూడా రివ్యూ చేసారు. సుమంత నటన బాగుందన్నారు. సునిల్ శెట్టి నటించిన యాగన్ సినిమాతో ఈ చిత్రాన్ని పోల్చారు.
నూతన ఒరవడి కోసం ఇలాంటి సినిమాలు తప్పకుండా చూడాలన్నారు. 'సినిమా సోలో మ్యాన్ షో మాదిరిగా కాకుండా మధ్యలో అతని ప్రియురాలి పాత్రను నెమరువేసుకునే సన్నివేశాలు రూపొందించి ఉంటే ఇంకా బాగుండేది. అలా చేస్తే ఇంతకన్నా మంచి రివ్యూ వచ్చేది. ఈ సినిమా కథ అంతా రేడీయో జాకీగా పనిచేసే ఓకుర్రాడి చుట్టూ తిరుగుతుంది. ఒకే పాత్రతో సినిమా తీయడం అన్నది చాలా కష్టమైన పని.
కానీ దర్శకుడు దాన్ని ఎంతో తెలివిగా డీల్ చేసాడు. అందులోనూ సుమంత్ లాంటి హీరోతో ఇలాంటి సినిమా తీయడం గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ తన ఇమేజ్ కి నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. ఒకే పాత్రతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కష్టం. సినిమాలో ఇతర పాత్రలేంటని ఆడియన్ మైండ్ ఆలోచి స్తుంది. కానీ ఆ ఛాన్స్ ఇవ్వకుండా దర్శకుడు చేసాడు. ఇందులో మంచి సందేశం కూడా ఉంది. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది మంచిది కాదనే పాయింట్ ని సినిమాలో చక్కగా చూపించారు. తన జీవితంలో జరిగినట్లు మరొకరి జీవితంలో జరగకూడదనే హీరో తపన హృదయాల్ని హత్తు కుంటుంది' అని అన్నారు.