నాని 'జెండా పై కపిరాజు' హీరోయిన్ పెళ్లి!
నేచురల్ స్టార్ నాని సరసన 'జెండా పై కపిరాజు' అనే చిత్రంలో నటించింది.
By: Tupaki Desk | 5 Feb 2025 7:00 AM GMTదక్షిణాదిన నాలుగు ప్రధాన భాషల్లో నటించింది పార్వతి నాయర్. నేచురల్ స్టార్ నాని సరసన 'జెండా పై కపిరాజు' అనే చిత్రంలో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో పలు చిత్రాలతో పాపులరైన ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లితో జీవితంలో సెటిలవుతోంది.
పార్వతి నాయర్, చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అశ్రిత్ అశోక్‌ను వివాహం చేసుకోనుంది. వారి బంధాన్ని ఇరు కుటుంబాలు ఆమోదించాయి. నిశ్చితార్థ వేడుక ఇటీవల చెన్నైలో జరిగింది. మెహందీ , హల్దీ సహా ప్రీవెడ్డింగ్ వేడుకలు ఫిబ్రవరి 6న చెన్నైలో ప్రారంభం కానున్నాయి. పార్వతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేయగా ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఓ కార్యక్రమంలో కలిసాక మాటలు కలిసాయని ఇప్పుడు ప్రేమలో ఉన్నామని పార్వతి వెల్లడించారు. కొన్ని నెలల పాటు ఈ జంట డేటింగ్ సాగింది. చెన్నైలో మలయాళం, తెలుగు సంప్రదాయాలను అనుసరించి తల్లిదండ్రుల ఆమోదంతో వివాహం చేసుకుంటున్నామని, వివాహానంతర వేడుకలు కేరళలో జరుగుతాయని నాయర్ వెల్లడించారు. అయితే పార్వతి నాయర్ వివాహ తేదీని ఇంకా ప్రకటించలేదు.
కమల్ హాసన్ -ఉత్తమ విలన్, గౌతమ్ మీనన్ యెన్నై అరిందాల్ (ఎంతవాడు కానీ- అనుష్క), ఎంగిట్ట మోతాతే, నిమిర్ వంటి చిత్రాలలో తన నటనతో మెప్పించింది. దళపతి విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ది గోట్'లో కూడా ఒక చిన్న పాత్ర పోషించింది. 2025 ఫిబ్రవరి 7న విడుదల కానున్న 'అలంబన' చిత్రంలో పార్వతి కీలక పాత్ర పోషించారు. పెళ్లి తర్వాత నటిస్తుందా లేదా? అన్నదానిపై స్పష్ఠత రావాల్సి ఉంది.