Begin typing your search above and press return to search.

అస‌భ్య ఫోటోలు వైర‌ల్ ..చానెల్‌పై న‌టి సీరియ‌స్

తన ఫోటోలను త‌ప్పుగా ఉప‌యోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు.

By:  Tupaki Desk   |   12 Feb 2025 2:45 AM GMT
అస‌భ్య ఫోటోలు వైర‌ల్ ..చానెల్‌పై న‌టి సీరియ‌స్
X

సోష‌ల్ మీడియా- డిజిట‌ల్ యుగంలో మ‌హిళ‌లు చాలా ప్రమాదాల్ని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. వారి ఫోటోలు ఆన్ లైన్‌లో డీప్ ఫేకింగ్ అవుతున్నాయి. సెల‌బ్రిటీల‌కు ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌. ఇప్పుడు మ‌ల‌యాళ‌ నటి కం ప్రెజెంటర్ పార్వతి ఆర్ కృష్ణ ఇటీవల జరిగిన ఫోటోషూట్ లోని తన ఫోటోలను ఎడిట్ చేసి ఫేకింగ్ చేసినందుకు ఒక యూట్యూబ్ ఛానల్ పై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. లేటెస్ట్ గ్లామరస్ ఫోటోషూట్ తెరవెనుక వీడియో నుండి ఒక ఫోటోని ఎడిట్ చేసి యూట్యూబ్ చానెల్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసార‌ని పార్వ‌తి తెలిపింది. తన ఫోటోలను త‌ప్పుగా ఉప‌యోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు.

తాజా ఇన్ స్టా పోస్ట్ లో తీవ్రంగా స్పందించిన‌ పార్వ‌తి.. నేను రెగ్యుల‌ర్‌గా ఫోటోషూట్‌లలో పాల్గొంటాను కానీ నా శరీరాన్ని బహిర్గతం చేయడం గురించి నాకు చాలా తెలుసున‌ని అన్నారు. ''బీచ్ ఫోటోషూట్ సమయంలో కూడా నా నాభి లేదా థై స్లిట్ ను బహిర్గతం చేయకూడదనే స్పృహలో ఉన్నాను. నా ఫోటోషూట్ వీడియోను పోస్ట్ చేసినప్పుడు, వైడ్‌షాట్‌లలో ఒకదానిలో నా నాభి కనిపించింది. అయితే ఓ మీడియా ఛానెల్ నా నాభిని మాత్రమే ప్రొజెక్ట్ చేసి వారి ఛానెల్‌లో పోస్ట్ చేసింది. ఆ ఛానెల్ ని మూయించేందుకు చేయాల్సిన‌దంతా చేస్తాను. నా అనుమతి లేకుండా నా వీడియోలు లేదా ఫోటోలను టెలీకాస్ట్ చేస్తే, దానికి అనవసరమైన నేపథ్య సంగీతాన్ని ఉపయోగించ‌డం కూడా నాకు ఇష్టం లేదు. ఎవరైనా అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తే, మీ ఛానెల్ ని మూయించేస్తాను'' అని హెచ్చ‌రించారు.

మీరు నా ఫోటోలను మార్చి ఎడిట్ చేయ‌డానికి లేదా దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే మీరే జవాబుదారీ. ఇది బెదిరింపు కాదు.. తుది హెచ్చ‌రిక‌. నా వ్యక్తిగత అంశంలోకి ప్ర‌వేశిస్తే మ్యాట‌ర్ సీరియ‌స్ గా ఉంటుంద‌ని పార్వ‌తి వార్నింగ్ ఇచ్చారు. ఇతరులు అలాంటి సమస్యలపై ఎందుకు స్పందించరో నాకు అర్థం కావడం లేదని కూడా ఆవేద‌న చెందారు.