యువ నటులు వరస్ట్.. పాత తరమే బెస్ట్.. హీరోయిన్ కామెంట్
పాత తరం తారలతో పోలిస్తే నేటితరం నటీనటులు వరస్ట్ అని పార్వతి వ్యాఖ్యానించారు. మలయాళ యువ నటులు సోమరితనం, నిరాశను ప్రదర్శిస్తారని విమర్శించారు.
By: Tupaki Desk | 9 Jan 2025 12:30 AM GMTపరిశ్రమలో పురుషాధిక్యాన్ని ప్రశ్నించే కథానాయికల్లో మలయాళీ కథానాయిక పార్వతి తిరుమోతు పేరు రెగ్యులర్ గా వినిపిస్తుంది. వీలున్న ప్రతి వేదికపైనా మేల్ డామినేషన్ ని నిలదీసేందుకు పార్వతి వెనకాడరు. గతంలో హేమ కమిటీ ఆరోపణల అనంతరం అమ్మా (మలయాళ ఆర్టిస్టుల సంఘం) అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చిన సూపర్ స్టార్ మోహన్ లాల్ ని కూడా పార్వతి వదిలిపెట్టలేదు. అంత పెద్ద హీరోపైనా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు యువతరం నటీనటులపై ఓ ఈవెంట్లో ఈ భామ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిగ్గా మారాయి. ఇంతకీ పార్వతి ఏమని కామెంట్ చేసారు? అంటే....
పాత తరం తారలతో పోలిస్తే నేటితరం నటీనటులు వరస్ట్ అని పార్వతి వ్యాఖ్యానించారు. మలయాళ యువ నటులు సోమరితనం, నిరాశను ప్రదర్శిస్తారని విమర్శించారు. వయనాడ్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పార్వతి మాట్లాడుతూ.. యువ నటులకు ఇండస్ట్రీ లో ఏం జరుగుతుందో అంతా తెలుసు కానీ అసమాన అవకాశాల కారణంగా అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. సాహితీ ఉత్సవంలో ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌తో మాట్లాడిన పార్వతి తిరువోతు ప్రస్తుత తరం నటీనటుల వైఖరి చాలా ఇబ్బందికరంగా ఉందని అన్నారు. పాత తరం పితృస్వామ్య వ్యవస్థ స్త్రీద్వేషంతో ప్రభావితమవుతుండగా, యువ తరం నటులు కొన్ని ఇతర కారణాల వల్ల నిరాశకు గురవుతున్నారని అన్నారు. పాత తరం అనుభవిస్తున్న ప్రయోజనాలను అందుకోలేక నేటితరం నిరాశకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు.
''ఆల్ఫా మగ భావనలతో కొన్ని పెద్ద సినిమాలు తీసారు .. మహిళల గురించి పాత భావనలను తిరిగి తీసుకురావడానికి ఇలాంటివి తీసారు'' అని పార్వతి తిరువోతు అన్నారు. తాను గతంలో ఓ సినిమా చూశానని, భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి వారితో కలిసి పనిచేయాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందానని వ్యాఖ్యానించారు. కొన్ని హై బడ్జెట్ చిత్రాలు పురుషాధిక్యాన్ని ప్రదర్శించి, స్త్రీద్వేషాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాయని తన స్పీచ్ లో హైలైట్ చేసారు పార్వతి. మలయాళ బ్యూటీ పార్వతి తిరుమోతు ఇటీవల తంగళన్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.