మంచి వ్యక్తిని వదులుకున్నా..!
తాజాగా తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి చెప్పి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది.
By: Tupaki Desk | 6 Feb 2025 7:20 AM GMTహీరోయిన్స్ తమ ప్రేమ వ్యవహారాల గురించి చాలా తక్కువగా మీడియాతో షేర్ చేసుకుంటూ ఉంటారు, సోషల్ మీడియాలో షేర్ చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇక తమ లవ్ ఫెయిల్యూర్స్ గురించి అస్సలు మాట్లాడరు. తాము ఎదుర్కొన్న పెయిన్ గురించి ఒకరు ఇద్దరు మాట్లాడినా అవతలి వారిపై విమర్శలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ బ్రేకప్‌లో తప్పు అంతా తనదే అంటూ ఒప్పుకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే హీరోయిన్ పార్వతి తిరువోత్తు ముందు ఉంటారు. ఆమె ఏ విషయాన్ని అయినా చాలా సూటిగా సుత్తి లేకుండా చెబుతుందని అంతా అంటూ ఉంటారు. తాజాగా తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి చెప్పి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది.
తంగలాన్ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న పార్వతి తిరువోత్తు ప్రస్తుతం ఒకటి రెండు సినిమాల్లో నటిస్తోంది. గత సంవత్సరం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఈ ఏడాది కనీసం రెండు సినిమాలతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమాలతో బిజీగా ఉన్న పార్వతి తిరువోత్తు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను జీవితంలో లవ్ ఫెయిల్యూర్‌ను చూశాను అంది. అంతే కాకుండా తాను చేసిన తప్పుల వల్ల, తన ప్రవర్తన వల్ల ఆ ప్రేమ విఫలం అయ్యిందని కూడా నిర్మొహమాటంగా ముద్దుగుమ్మ పార్వతి చెప్పుకొచ్చారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పార్వతి తిరువోత్తు మాట్లాడుతూ... తన జీవితంలో ఒకప్పుడు అందమైన ప్రేమ కథ ఉండేది. నేను అతడితో డేట్‌లో ఉన్నాను. అతడు చాలా మంచి వాడు, అన్ని విషయాలను అర్థం చేసుకునే అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అతడు ఎంతో కూల్‌గా ఉంటే నేను మాత్రం చిన్నదానికి కూడా ఎంతో కోపం తెచ్చుకునేదాన్ని. ఆకలికి తట్టుకోలేక కూడా చాలా సార్లు ఆయనపై అరిచిన సందర్భాలు ఉన్నాయి. నా కోపం వల్ల, నా ప్రవర్తన వల్ల ఆయన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టాను. ఆయన చాలా ఓపికగా భరించారు. అలా సాగే మా రిలేషన్ షిప్ ఎక్కువ కాలం కొనసాగలేదు.
అతడితో విడిపోయిన తర్వాత మళ్లీ కలిశాను. ఆ సమయంలోనూ అతడు చాలా బాగా మాట్లాడాడు. ఆ సమయంలో అతడిని తన ప్రవర్తనకు గాను క్షమాపణలు చెప్పాను. బ్రేకప్ అనేది నా జీవితంలో చాలా మార్పులు తీసుకు వచ్చింది. దాంతో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రతి బంధంలోనూ ఎదుటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయంలోనూ గౌరవం చూపించాలి. అలా కాకుండా ఉంటే కచ్చితంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే బాధ తప్ప మరేం ఉండదు. కనుక రిలేషన్‌లో ఉన్నప్పేడే పార్టనర్‌తో జాగ్రత్తగా ఉండాలని పార్వతి సూచించింది.