Begin typing your search above and press return to search.

హీరోయిన్ టీ షాప్ ఆన్సర్ షాకింగ్..!

సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చే ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ అవుతారని చెప్పడం కష్టం.

By:  Tupaki Desk   |   24 July 2024 10:29 AM GMT
హీరోయిన్ టీ షాప్ ఆన్సర్ షాకింగ్..!
X

సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చే ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ అవుతారని చెప్పడం కష్టం. ఎంత టాలెంట్ ఉన్నా సరే ఇక్కడ కాస్తంత లక్ తోడు కాకపోతే మాత్రం కెరీర్ కొనసాగించడం కష్టం. అందుకే ఇక్కడ ఉన్నన్నాళ్లు డబ్బులు సంపాదించడం ఛాన్స్ లు లేని టైం లో.. అవకాశాలు రావని ఫిక్స్ అయినప్పుడు ఏదో ఒక రంగంలోకి వెళ్లడం చేస్తుంటారు. వెండితెర మీద హీరోలు, హీరోయిన్స్ గా నటించిన వారైనా సరే ఒకప్పుడు బాగా వెలుగు పొందిన వారైనా సరే ఎప్పుడో ఒకసారి కెరీర్ ఆగిపోతే అందుకు తగినట్టుగా వేరే ఆల్టర్నేటివ్ బిజినెస్ చూసుకుంటారు.


ఐతే ఇప్పటితరం భామలు ఇది కాకపోతే అది అనేట్టుగా ముందే కెరీర్ ఫిక్స్ చేసుకుని వస్తున్నారు. అంటే హీరోయిన్ గా ట్రై చేస్తున్న టైం లోనే ఏమో ఇక్కడ వర్క్ అవుట్ కాకపోతే ఎలా అనుకుని ముందే ఒక ప్రొఫెషన్ పట్టా పుచ్చుకుంటున్నారు. చాలామంది ఇప్పటి తారలు ప్రొఫెషనల్ గా ఒక రంగంలో ఉంటూ సినిమాల్లో కొనసాగుతున్నారు. చాలామంది హీరోయిన్స్ యాక్టర్ కాకపోయుంటే డాక్టర్ అయ్యేదాన్ని అని అంటుంటారు.

కానీ ఒక హీరోయిన్ మాత్రం తాను నటిని కాకపోతే మాత్రం కచ్చితంగా టీ షాప్ పెట్టేదాన్ని అంటుంది. ఇంతకీ టీ షాప్ పెడతా అన్న హీరోయిన్ ఎవరో కాదు పార్వతి తిరువొతు. నటిగా తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా అదరగొట్టేస్తున్న అమ్మడు ఒకవేళ యాక్టర్ ని కాకపోతే మాత్రం టీ షాప్ పెట్టేదాన్ని అని.. అది వృత్తి ఏదైనా మనం దాన్ని గౌరవంగా చేస్తే చాలని అంటుంది అమ్మడు.

ఇక విక్రం హీరోగా నటించిన తంగళాన్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసిన పార్వతీ తను చేసిన ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. సినిమాలో పాత్ర కోసం మేకప్ వేసుకోవడానికే చాలా ఎక్కువ టైం తీసుకున్నామని. ఆ మేకప్ తో ఎండలో పనిచేశామని చెప్పుకొచ్చారు. తంగళాన్ లాంటి ప్రాజెక్ట్ లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. విక్రం తంగళాన్ సినిమాను పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో చియాన్ విక్రం తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. కోలీవుడ్ లో అందరు హీరోలు తమ సినిమాలతో సత్తా చాటుతుండగా విక్రం మాత్రం వెనకబడిపోయారు. మరి ఈ సినిమా అయినా విక్రం హిట్ దాయం తీస్తుందా లేదా అన్నది చూడాలి.