ప్రియురాలు ఉన్న జైలుకే ఆయన కూడా!
ఇదే హత్య కేసులో ఏ1గా ఉన్న పవిత్ర గౌడ్ ని ఇప్పటికే ఇదే పరప్పన్ అగ్రహారం జైలుకి తరలించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Jun 2024 5:55 AM GMTరేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ ఏ2గా అభియోగం ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. పదిరోజులుగా అధికారులు అతన్ని విచారిస్తున్నారు. కీలక సమాచారమంతా రికార్డు చేసారు. ఇప్పటివకూ పోలీస్ కస్టడీలో ఉన్న దర్శన్ కు జ్యూడీషియల్ కస్టడీకి అదేశాలిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దర్శన్ తో పాటు అతని సహచరులను శనివారః నగరంలోని 54వ ఏసీఎంఎం కోర్టులో హాజరు పరచగా కోర్టు జ్యూడీషియల్ కస్టడీకి అదేశించింది.
దర్శన్ తో పాటు అతని గ్యాంగ్ మొత్తానికి జులై 4వరకూ ఈ కస్టడీ విధించింది. వీళ్లందర్నీ పరప్పన్ అగ్రహారం జైలుకు తరలిం చాలని కోర్టు అదేశాలిచ్చింది. ఇదే హత్య కేసులో ఏ1గా ఉన్న పవిత్ర గౌడ్ ని ఇప్పటికే ఇదే పరప్పన్ అగ్రహారం జైలుకి తరలించిన సంగతి తెలిసిందే. ఆమెని మహిళా విభాగంలో ఉంచారు. తాజాగా ప్రియుడు దర్శన్ కి కూడా అదే జైలుకి తరలించడం ఆసక్తి సంతరించుకుంది.
దీంతో దర్శన్ లాయర్లు బెయిల్ ప్రోసస్ ని వేగవంతం చేసారు. అతని తరుపున వాదించడానికి నలుగురు లాయర్లను నియమించు కున్నారు. అనీల్, బాబు , రంగనాధ్ రెడ్డి, అలాగే మరో సీనియర్ లాయర్ సీవీ నాగేశ్ ని కూడా నియమించుకున్నారు. ఇటీవల జైలు పాలైన మాజీ మంత్రి రేవన్న కేసును కూడా నాగేశ్ వాదించి బెయిల్ తేగలిగారు. అనేక క్రిమియన్ కేసుల్లో విజయం సాధించిన రికార్డ్ నాగేశ్ కి ఉంది.
ఇప్పటికే లాయర్ రాఘవేంద్ర అన్నపూర్ణేశ్వరీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసుకు సంబంధించి పూర్తి సమాచారం తీసుకున్నారు. వీలైనంత వేగంగా కోర్టు నుంచి బెయిల్ తీసుకురావాలని లాయర్లంతా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు భార్య విజయలక్ష్మి ప్రయత్నాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఇదే కేసులో విజయలక్ష్మిని కూడా పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.