Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : చాలా కాలం తర్వాత అందాల మెల్టన్‌

లుక్ పరంగా కూడా పార్వతీ మెల్టన్‌ కొత్తగా కనిపిస్తుంది. కొందరు ఈ అమ్మడిని గుర్తించడమే కష్టంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 6:26 AM GMT
పిక్‌ టాక్‌ : చాలా కాలం తర్వాత అందాల మెల్టన్‌
X

పవన్‌ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాలో నటించిన ముద్దుగుమ్మ పార్వతీ మెల్టన్‌ గుర్తుండే ఉంటుంది. ఈమధ్య కాలంలో సినిమాలు చేయని ఈ అమ్మడు జల్సా కి ముందు ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసి మెప్పించింది. అయితే ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాకపోవడంతో ఆఫర్లు తగ్గాయి.

సినిమాలకు దశాబ్ద కాలంగా దూరంగా ఉంటున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా మాత్రం సందడి చేస్తుంది. ఈ మధ్య మరీ ముఖ్యంగా అందాల ఆరబోత ఫోటోలతో చంపేస్తుంది. గతంతో పోల్చితే ఇప్పుడు ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత జోరు మరింత పెరిగిందనే టాక్ వినిపిస్తుంది.

లుక్ పరంగా కూడా పార్వతీ మెల్టన్‌ కొత్తగా కనిపిస్తుంది. కొందరు ఈ అమ్మడిని గుర్తించడమే కష్టంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అమెరికన్‌ మోడల్‌ అయిన పార్వతీ మెల్టన్‌ భరత నాట్యం తో పాటు పలు రకాల డాన్స్ ల్లో ప్రావిణ్యం ను సొంతం చేసుకుని మిస్ టీన్‌ ఇండియా బే ఏరియా పోటీ విజేతగా నిలిచిన విషయం తెల్సిందే.

భారతీయ జర్మన్‌ ఐరిష్‌, స్కాటిష్ సంతతి అయిన పార్వతీ మెల్టన్‌ రానా నటించిన వెన్నెల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన అందాల ఆరబోత ఫోటోల కారణంగా మళ్లీ వార్తల్లో నిలిచింది. చాలా కాలం తర్వాత పార్వతి మెల్టన్ తన వైపుకు తిప్పుకుంది.

బీచ్ లో అందాల ఫోజ్ ఇస్తూ బికినీ లో ఈ అమ్మడు కన్నుల విందు చేసింది. ఈ స్థాయిలో అందాల ఆరబోత ను ఈమె నుంచి ఆశించలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, మరి కొందరు మాత్రం మళ్లీ సినిమాల్లో ఆఫర్స్‌ కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.