Begin typing your search above and press return to search.

గ్రీక్ గాడ్ హృతిక్ సోద‌రి క‌థానాయిక‌గా..

బాలీవుడ్‌లో రోష‌న్‌ల ఫ్యామిలీ ప్రాధాన్య‌త గురించి తెలిసిందే. ఈ కుటుంబం నుంచి హీరోలు, నిర్మాత‌లు, సంగీత దర్శ‌కులు, ర‌చ‌యిత‌లు ఇండ‌స్ట్రీలో ఉన్నారు

By:  Tupaki Desk   |   9 Nov 2023 1:30 AM GMT
గ్రీక్ గాడ్ హృతిక్ సోద‌రి క‌థానాయిక‌గా..
X

బాలీవుడ్‌లో రోష‌న్‌ల ఫ్యామిలీ ప్రాధాన్య‌త గురించి తెలిసిందే. ఈ కుటుంబం నుంచి హీరోలు, నిర్మాత‌లు, సంగీత దర్శ‌కులు, ర‌చ‌యిత‌లు ఇండ‌స్ట్రీలో ఉన్నారు. బాలీవుడ్ గ్రీక్ గాడ్‌గా గుర్తింపు ఉన్న హృతిక్ రోష‌న్ ఇప్ప‌టికే అసాధార‌ణ స్టార్‌డ‌మ్‌ని ఆస్వాధిస్తున్నారు. నేటి బాలీవుడ్ హీరోల్లో పాన్ ఇండియా హీరోగా స‌త్తా చాటడంలో హృతిక్ పెద్ద స‌క్సెస‌య్యాడు. ఈ కుటుంబం నుంచి ఇప్పుడు ఓ అందాల భామ‌ వెండితెర‌కు ప‌రిచ‌యం కానుంద‌ని కొంత కాలంగా ప్ర‌చారం సాగుతోంది. ఈ యంగ్ బ్యూటీ పేరు హ‌ష్మీనా రోష‌న్. హ‌ష్మీనా మొద‌టి సినిమాని కూడా ఇటీవ‌ల లాంచ్ చేసారు.


సంగీత దర్శకుడు రాజేష్ రోషన్ కుమార్తె పష్మీనా రోషన్. హృతిక్ రోష‌న్ కి ఆమె కజిన్. హ‌ష్మీనాకు ఇషాన్ రోషన్ అనే సోద‌రుడు ఉన్నారు. రాజేష్.. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ కి స్వ‌యానా తమ్ముడు. ఇక త‌న సోద‌రుడు హృతిక్ రోష‌న్ తో క‌లిసి ఉన్న ఫోటోల‌ను హ‌ష్మీనా త‌ర‌చుగా సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేస్తుంటారు. వాటికి అభిమానుల నుంచి గొప్ప స్పంద‌న‌లు వ‌స్తుంటాయి. ఇంత‌కుముందు హృతిక్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా హ‌ష్మీక శుభాకాంక్ష‌లు తెలిపింది. అలాగే ఫ్యామిలీ వెకేష‌న్ స్పాట్ నుంచి త‌న అన్న హృతిక్ తో క‌లిసి ఉన్న ఫోటోల‌ను కూడా హ‌ష్మీనా షేర్ చేసింది. ఆ ర‌కంగా హృతిక్ అభిమానుల్లోను హ‌ష్మీనాకు గొప్ప ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

త‌దుప‌రి హ‌ష్మిక క‌థానాయిక‌గా న‌టించేందుకు రెడీ అవుతోంద‌న్న ప్ర‌చారం ఉంది. అదే క్ర‌మంలో నిరంత‌రం హ‌ష్మీక సెల‌బ్రిటీ ఫేజ్ 3 వేడుక‌ల్లోను సంద‌డి చేస్తోంది. ఇటీవ‌ల టిసిరీస్ ర‌మేష్ తౌరాణీ ఏర్పాటు చేసిన దీపావ‌ళి పార్టీలో బాలీవుడ్ టాప్ స్టార్ల‌తో పాటు, హ‌ష్మీనా రోష‌న్ కూడా సంద‌డి చేసింది. ఈ వేడుక‌ల్లో హ‌ష్మీనా ఎంతో ట్రెడిష‌న‌ల్ లుక్ తో క‌నిపించింది. హ‌ష్మీనా గ్లామ‌ర్ యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకుంది. పష్మీనా రొమాంటిక్ కామెడీ `ఇష్క్ విష్క్ రీబౌండ్‌` అనే చిత్రంతో న‌టిగా అరంగేట్రం చేస్తోంది. ఇందులో రోహిత్ సరాఫ్ - నైలా గ్రేవాల్‌, జిబ్రాన్ ఖాన్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.