పొట్ట ఎత్తుగా ఉంటే గర్భం దాల్చినట్లేనా?
బాలీవుడ్ దంపతులు రాజ్ కుమార్ రావ్-పత్రలేఖ పాల్ ధాంపత్య జీవితంలో ఎంతో సంతోషంగా ముందు కు సాగిపోతున్నారు.
By: Tupaki Desk | 22 Aug 2024 7:30 PM GMTబాలీవుడ్ దంపతులు రాజ్ కుమార్ రావ్-పత్రలేఖ పాల్ ధాంపత్య జీవితంలో ఎంతో సంతోషంగా ముందు కు సాగిపోతున్నారు. అయితే వివాహామై ఐదేళ్లు అవుతున్నా? ఈ దంపతులు ఇంకా తల్లిదండ్రుల కాలేదు. ఇరువురు కెరీర్ పైనే ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. అయితే గర్బం విషయంలో పత్రలేఖ పాల్ చీటికీ మాటికి నెట్టింట చర్చకు దారి తీస్తోంది. ఆమె రూపంలో కాస్త మార్పొస్తే చాలు? గర్బం దాల్చిందనే ప్రచారం ఠారెత్తిపోతుంది.
తాజాగా ఈ ప్రచారంపై పత్రలేఖపాల్ తనదైన శైలిలో స్పందించింది. ఆ సంగతేంటో ఆమె మాటల్లోనే... `నా కడుపు కొద్దిగా ఉబ్బినట్లు కనిపించినప్పుడల్లా ప్రజలు గర్భం దాల్చింద తీర్మానం చేస్తున్నారు. శరీరం ఉబ్బరంగా కనిపించినా...కొద్దిగా ఎక్కువగా తిన్నప్పుడు కాస్త పొట్ట ముందు కొచ్చినా నెల తప్పిందంటున్నారు. ఇలాంటి ప్రచారం చాలాసార్లు జరిగింది.
మొదట్లో చూసి బాధపడేదాన్ని. కాలక్రమంలో అలవాటు అయిపోయింది. ఇవన్నీ అనవసరమైన వార్తలు అనిపించింది. నేను ఒక స్త్రీని, నా బెస్ట్ ఫీల్ లేని రోజులు కూడా ఉన్నాయి. వేసుకునే దుస్తుల నుంచి కేశాలంకరణ వరకూ ప్రతీ విషయంలోనూ విమర్శలొస్తున్నాయి. ఒకరిని చూసి అలా ఎందుకు విమర్శిస్తారో ఇప్పటికీ అర్దం కాలేదు. మీరు ఇలా ఉన్నారేంటి? ఇలాగే ఎందుకు రెడీ అయ్యారు? మీ జుట్టు సరిగ్గా వేసుకున్నట్లు లేదు? ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తుంటారు.
వాటిలో ఏ మాత్రం అర్దం ఉండదు. నాకు లేని సమస్య నన్ను చూసిన వారికి ఉంటుందనుకుంటా. అయినా అలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన పనిలేదు` అని అంది. ప్రస్తుతం పత్రలేఖ పాల్ ` C 814: ది కాందహార్ హైజాక్`లో నటిస్తోంది. ఇది త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతుంది.