పుష్పరాజ్ కుమార్తె స్టన్నింగ్ లుక్
పావని కరణం .. ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు. తెలుగు ఫిలింసర్కిల్స్ లోను ఈ తెలుగమ్మాయి ప్రతిభ గురించి చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 14 Feb 2025 3:46 AM GMTపావని కరణం .. ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు. తెలుగు ఫిలింసర్కిల్స్ లోను ఈ తెలుగమ్మాయి ప్రతిభ గురించి చర్చ సాగుతోంది. పుష్ప 1, పుష్ప 2 చిత్రాల్లో నటించిన పావని కరణం ఎంపిక చేసిన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అసలు ఇంటి పేరుతో ఒక ఐడెంటిటీ లేని పుష్పరాజ్ కి అన్న కూతురు కావేరిగా పావని నటించింది. అంతేకాదు సొంత అన్నయ్య అజయ్.. పుష్పరాజ్ ని అవమానిస్తుంటే, చివరికి అతడిని అన్ని అవమానాల నుంచి బయటపడేసే కీలక పాత్రలో పావని కనిపించింది. పుష్ప 2 క్లైమాక్స్ ని అర్థవంతంగా ముగించేందుకు సుకుమార్ ఎంతో తెలివిగా అజయ్ కుమార్తె పాత్రను ఉపయోగించుకున్నారు. ఆ పాత్రలో అద్భుతంగా నటించింది పావని.
పల్లెటూరిలో ఇంటి పేరు లేకుండా ఉం*కున్న దానికొడుకు అంటే ఆ బాధ ఎలా ఉంటుందో పల్లెల్లో నివశించే పుష్పరాజ్ లాంటి వ్యక్తులకు తెలుస్తుంది. ఆ బాధను తెరపై పండించడంలో బన్ని వందశాతం మార్కులు కొట్టేసాడు. అలాగే కీలక సమయంలో అజయ్ కుమార్తె పై సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అకస్మాత్తుగా కొందరు పోకిరి కుర్రాళ్లు పుష్పరాజ్ అన్న కూతురు కావేరి (పావని)ని కిడ్నాప్ చేసాక యాక్షన్ డ్రామా మరో లెవల్ కి చేరుకుంటుంది. చిన్నాన్న పుష్పరాజ్ పాత్రలో ఎమోషనల్ కంటెంట్ ని ఎలివేట్ చేసేందుకు పావని పాత్ర సహకరించింది.
ఇక పావని పదహారణాల పల్లెటూరి తెలుగమ్మాయి ఎలా ఉంటుందో అలాగే తెరపై చీరల్లో మురిపించింది. క్లైమాక్స్ లో పావనిని అడ్డు పెట్టుకుని పుష్పరాజ్ పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న రౌడీలకు జీవితంలో మర్చిపోలేని విధంగా ఏం జరిగిందన్నది తెరపైనే చూడాలి. మొత్తానికి పావనికి సుకుమార్ కీలక పాత్రలో ఆఫర్ ఇవ్వడంతో ఆ ఎమోషన్ ని తను ఎప్పటికీ దాచుకోలేకపోతోంది. ఇంతకుముందు ఒక వేదికపై కన్నీటిపర్యంతం అవుతూ సుక్కూ అండ్ బన్నీకి థాంక్స్ చెప్పింది కూడా. పావని తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి.
ఈ భామ ఇంతకుముందు సివరపల్లి అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా పోస్టర్లను కూడా పావని ఇన్ స్టాలో షేర్ చేసింది. ముఖ్యంగా పుష్ప 2లో తన పాత్రకు సంబంధించిన చాలా ఫోటోలను పావని ఇన్ స్టాలో రెగ్యులర్ గా అప్ డేట్ చేసింది. ప్రతిభకు పట్టంగట్టే టాలీవుడ్ లో ఈ తెలుగమ్మాయి కెరీర్ కూడా మునుముందు స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా దూసుకెళుతుందనడంలో సందేహం లేదు.