పాపాన్ని త్రివేణి సంగమం స్నానంతో కడిగేస్తున్నావా?
రేణుకాస్వామి హత్య కేసులో పవిత్రా గౌడ పేరు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఈ మర్డర్ కేసులో అమ్మడు ఏ1 నిందితురాలుగా ఉంది.
By: Tupaki Desk | 1 Feb 2025 7:14 AM GMTరేణుకాస్వామి హత్య కేసులో పవిత్రా గౌడ పేరు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఈ మర్డర్ కేసులో అమ్మడు నిందితురాలుగా ఉంది. ప్రియుడు, కన్నడ నటుడు దర్శన్ ని రెచ్చగొట్టి రేణుకాస్వామి మీదకు ఊసిగొలపడంతో ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతో కొన్ని నెలలు పాటు జైలు జీవితం గడిపిన పవిత్ర, దర్శన్ కు ఇటీవలే కోర్టు బెయిల్ మంజూర్ చేసింది. సాక్షాలు బలంగా ఉండటంతో పోలీసులు ఈ కేసుపై పోరాటం చేస్తున్నారు. మంజూరైన ఇద్దరి బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటీషన్లు దాఖలు చేస్తున్నారు.
ఆధారాలతో చట్టం ముందు నేరస్తులుగా నిలబెట్టాలని పోలీసులు అన్ని సాక్షాలతోనూ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిదిలో ఉంది. అయితే తాజాగా పవిత్రా గౌడ్ ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు హాజరైంది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించింది. మౌని అమావాస్య రోజు త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించింది. అలాగే పవిత్ర ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా షేర్ చేసింది.
`మౌని అమావాస్య రోజున మహాకుంభ మేళాలో స్నానం ఆచరించడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నా. నెగిటివ్ తొలగిపోయి అంతా పాజిటివ్ గా మారుతుందని నమ్ముతున్నా` అని పోస్ట్ పెట్టింది. 'హరహర మహాదేవ్' అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ పోస్ట్..ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కుంభమేళాలో పవిత్ర ను గుర్తు పట్టిన వారంతా షాక్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే పవిత్ర పోస్ట్ పై రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
చేసిన పాపాలను మౌనీ అమావాస్య రోజున త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి కడిగేసుకుంటున్నావా? వీటికి పవిత్ర రిప్లై కూడా ఇచ్చింది. 'మతానికి, అన్యాయానికి జరిగిన సంఘర్షణలో మతమే గెలుస్తుంది. నన్ను తిడుతూ, నన్ను బాధపెడుతున్న న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా కు థాంక్స్. హద్దుల మీరుతోన్న పోస్టులతో మనసు బాధపడుతోందని వాపోయింది. మరింత బాధకు గురి చేస్తున్నారని బాధపడింది.