Begin typing your search above and press return to search.

ఆసుప‌త్రిలో ప‌విత్ర‌..విచార‌ణ‌తో ఇబ్బంది !

రేణుకాస్వామి హ‌త్య కేసులో విచార‌ణ ఎదుర్కోంటున్న క‌న్న‌డ న‌టి ప‌విత్ర గౌడ్ తీవ్ర అస్వాస్థ‌కు గురైంది

By:  Tupaki Desk   |   19 Jun 2024 6:15 AM GMT
ఆసుప‌త్రిలో ప‌విత్ర‌..విచార‌ణ‌తో ఇబ్బంది !
X

రేణుకాస్వామి హ‌త్య కేసులో విచార‌ణ ఎదుర్కోంటున్న క‌న్న‌డ న‌టి ప‌విత్ర గౌడ్ తీవ్ర అస్వాస్థ‌కు గురైంది. దీంతో పోలీసులు ఆమెని బెంగుళూరులోని ప్ర‌భుత్వ‌ ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. డాక్ట‌ర్లు ఎలాంటి ప్రాణాపాయంలేద‌ని తెలిపారు. వివ‌రాల్లోకి వెళ్తే గ‌త ప‌ది రోజులుగా ప‌విత్ర పోలీసుల విచార‌ణ ఎదుర్కుంటుంది. హ‌త్య కోణంలో అమెని పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ అధికారులు ఆమెని చుట్టు ముట్టి విచారించ‌డంతో తీవ్ర ఒత్తిడికి గురైంది.

దీంతో ఆమె అస్వస్త‌త‌కు గురైంది. ఈ నేప‌థ్యంలో క‌ళ్లు తిరిగి ప‌డిపోవ‌డంతో ఆసుప‌త్రిలో చేర్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కొన్ని రోజుల పాటు ఎలాంటి విచారణ చేసే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. ఆమె త‌రుపు న్యాయ‌వాది తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని కోర్టులో పిటీష‌న్ వేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌విత్ర ఇవ్వాల్సిన స‌మాచారం దాదాపు పోలీసులకు అందించిద‌ని తెలుస్తోంది.

రేణుకాస్వామి త‌న ప‌ట్ల అసభ్య ప‌ద‌జాలంతో పెట్టిన పోస్టుల‌ను చూపించడం, ఆ విష‌యం ప్రియుడు ద‌ర్శ‌న్ కు చెప్ప‌డంతో ఇంత ఘోరం చోటు చేసుకున్న‌ట్లు ఆమె వెల్ల‌డించినట్లు వార్త‌లొచ్చాయి. రేణుకాస్వామి హత్య జ‌రిగిన స‌మ‌యంలో ఆమె స్పాట్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందుకు త‌గ్గ ఆధారాలు పోలీసులు సేక‌రించారు. హ‌త్య అనంత‌రం ఆమె నేరుగా ఇంటికెళ్లిన‌ట్లు చెబుతున్నారు.

ఆరోజు ఆమె ధ‌రించిన దుస్తులు, చెప్పులు , దాడి చేసిన చెప్పును పోలీసులు స్వాదీనం చేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. కోపంతో రేణుకాస్వామిపై తొలుత దాడి చేసింద‌ని ప‌విత్ర అని పోలీసులు చెబుతున్నారు. ఆ త‌ర్వాతే మిగ‌తా వారంతా అత‌డిపై మూకుమ్మ‌డిగా దాడికి తెగ‌బ‌డిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు విచార‌ణ ప్రారంభ‌మైన త‌ర్వాత నిందితుల్లో ఒక‌రి తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. అలాగే ద‌ర్శ‌న్ మేనేజర్ కూడా సూసైడ్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.