పవిత్ర గౌడ్ కి షాకిచ్చిన జైలు అధికారులు!
కన్నడ నటి పవిత్రా గౌడ్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన్ అగ్రహారం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 21 July 2024 7:23 AM GMTకన్నడ నటి పవిత్రా గౌడ్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన్ అగ్రహారం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కస్టడీ ముగియడంతో మళ్లీ ఆగస్టు 1వరకూ పొడిగించారు. బెయిస్ లో కోసం చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. అయితే శనివారం పవిత్రా గౌడ్ తల్లి కుమార్తెని చూడటానికి జైలుకి వచ్చారు. కుమార్తెకు ఒక బాక్సుని ఇవ్వగా దానిని జైలు అధికారులు నిరాకరించారు.
ఇంటి నుంచి తీసుకొచ్చిన తినుబండాలు పెట్టుకునేందుకు పవిత్ర ఓ బాక్స్ తీసుకురమ్మందిట. ఆ మాట ప్రకారం తల్లి తీసుకురాగా అధికారులు అందుకు అనుమతించలేదు. బయట నుంచి వచ్చే ఎలాంటి పాత్రలుగానీ, డబ్బాలు గానీ లోపలకి అనుమతించమని చెప్పారుట. దీంతో పవిత్ర అధికారులపై అసహనం వ్యక్తం చేసిందిట. కనీసం తృప్తిగా ఒక్క పూటైనా తినే అవకాశం కూడా కల్పించరా? అని ఆవేదన చెందిందిట.
ములాఖత్ అనంతరం పవిత్ర తల్లి కాసేపు మాట్లాడి వెళ్లిపోయారుట. ఈ కేసు విచారణలో భాగంగా దర్శన్, పవిత్రా గౌడ్ కూడా వేర్వేరు సిమ్ కార్డులు వినియోగించినట్లు తేలింది. మొత్తం ఐదు సిమ్ కార్డులు కొత్తవి తీసుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అలాగే తాజాగా రేణుకాస్వామి కుటుంబ సభ్యులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్యని కలిసారు. రేణుకాస్వామి భార్యకి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేసారు.
సిద్దారామయ్య సానుకూలంగా స్పందించి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఆగస్టు 1న జరగనుంది. ఇప్పటికే పోలీసులు బలమైన సాక్ష్యాలు సంపాదించారు. అంతకు ముందు జరిగిన ప్రాధమిక విచారణ బలంగా ఉంది. దీంతో పవిత్ర, దర్శన్ లకు బెయిల్ రావడం కూడా కష్టంగా మారింది.