Begin typing your search above and press return to search.

స్టార్ క్యాంపెయిన‌ర్ల‌గా ఆ న‌లుగురు రారా?

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న నేప‌థ్యంలో టీడీపీ+జ‌న‌సేన‌+బీజేపీ కూట‌మి ప‌గ‌లు..రాత్రి తేడా లేకుండా జ‌నాల్లోనే తిరుగుతోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   11 April 2024 7:16 AM GMT
స్టార్ క్యాంపెయిన‌ర్ల‌గా ఆ న‌లుగురు రారా?
X

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న నేప‌థ్యంలో టీడీపీ+జ‌న‌సేన‌+బీజేపీ కూట‌మి ప‌గ‌లు..రాత్రి తేడా లేకుండా జ‌నాల్లోనే తిరుగుతోన్న సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు నాయుడు..ప‌వ‌న్ క‌ళ్యాణ్‌...బీజేపీ నాయ‌కులు అంతా క‌లిసి మెలిసి ప‌నిచేస్తోన్న త‌రుణం ఇది. క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖం అన్న చందంగా మూడు పార్టీలు ఎంతో అన్యోన్యంగా క‌నిపిస్తున్నాయి. కూట‌మితో ఏపీలో త‌మ ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వ‌స్తుంద‌ని బ‌లంగా విశ్వ‌శిస్తున్నాయి. 2024 లో కూట‌మి వ‌స్తుంది. ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చుతామ‌నే ఏజెండా తో మునుముందుకు దూసుకుపోతుంది.

ఆ కూట‌మి నుంచి జ‌న‌సేన‌ని వేరు చేసి చూస్తే! పార్టీ నుంచి బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల త‌ర‌ఫున‌ ప్ర‌చారం చేసేందుకు సేనాని ఇటీవ‌ల‌ స్టార్‌ క్యాంపెయిన‌ర్ల‌ను ప్ర‌క‌టించారు. ఈ జాబితాలో నాగబాబు- టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు- డాన్స్ మాస్ట‌ర్‌ జానీ మాస్టర్- సీరియ‌ల్ కం సినిమా హీరో సాగర్- క‌మెడియ‌న్ పృథ్విరాజ్- జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్లు హైపర్ ఆది- గెటప్ శ్రీను ఉన్నారు. ఇప్పుడు వీళ్ల‌కు తోడుగా నేను ఉన్నాను...నా మ‌ద్ద‌తు జ‌న‌సేన‌కే అంటూ న‌టుడు న‌వ‌దీప్ కూడా ముందుకొచ్చాడు.`ల‌వ్ మౌళి` ప్ర‌చారంలో భాగంగా పిఠాపురంలోని శ్రీపాద‌వ‌ల్ల‌భుడి ఆల‌యంలో న‌వ‌దీప్ ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం ఈ ప్ర‌క‌ట‌న చేసి జ‌న‌సేన‌ అభిమానుల్లో జోష్ నింపాడు.

వీళ్లంతా స‌రే మ‌రి! సేనాని త‌రుపున బ‌ల‌మైన‌ అండ‌నిచ్చేందుకు అన్న‌య్య చిరంజీవి-అబ్బాయిలు రామ్ చ‌ర‌ణ్, వ‌రుణ్ తేజ్- బంధువు బ‌న్నీ కూడా వ‌స్తారా? రారా? అన్న‌ది సేనాని అభిమానుల్లో అర్ధం కాని సందేహంగా మారిపోయింది. ఇటీవ‌లే చిరంజీవి పార్టీకి 5 కోట్లు ఫండ్ కూడా ఇచ్చారు. ఆ ర‌కంగా త‌న మ‌ద్దతు త‌మ్ముడికే అని ఓపెన్ అయిన‌ట్లు అయింది. ఇంత‌వ‌ర‌కూ సైలెంట్ గా ఉన్నా మొన్న‌టి స‌న్నివేశంతో చిరు ఒపెన్ అయిన‌ట్లు క‌నిపించింది.

మ‌రి అన్న‌య్య జ‌నాల్లోకి వ‌చ్చి ప‌వ‌న్ త‌రుపున కూట‌మికి అధికార‌కంగా మద్ద‌తిస్తారా? లేదా? అన్న‌ది స‌స్పెన్స్. ఇక బాబాయ్ పిల‌వాలే గానీ చ‌ర‌ణ్‌..వ‌రుణ్ ప‌రిగెత్తుకొస్తామ‌ని ప‌బ్లిక్ గానే చెప్పారు. మ‌రి బాబాయ్ వాళ్ల‌ని పిల‌వ‌డా! వాళ్ల‌కు తోడుగా మెగా అల్లుళ్లు కూడా మేము సైతం ఎప్పుడో అనేసారు. మ‌రి అల్లుళ్ల‌ని దించ‌డా? ఇక బ‌న్నీ అయితే పార్టీతో త‌న‌కేం సంబంధం లేన‌ట్లే తొలి నుంచి ఉన్నాడు. అల్లు అర‌వింద్ తో పవ‌న్ సత్స‌సంబంధాలు నెరుపుతున్న‌ట్లు ఈ మ‌ధ్య కాలంలో బాగానే ప్రచార‌మైంది. ఆయ‌న నుంచి అడ్వాన్స్ కూడా కొంత మొత్తం తీసుకున్న‌ట్లు ప్ర‌చారం లోకి వ‌చ్చింది. ఆ మొత్తం పార్టీ కోస‌మే అన్న ప్ర‌చారం సాగింది. మ‌రి అది నిజ‌మైతే! బావ త‌మ్ముడి పార్టీ కోసం అర‌వింద్ సార్ జ‌నాల్లోకి వ‌స్తారా? అన్న‌ది చూడాలి.