Begin typing your search above and press return to search.

పవర్ మాస్ మల్టీస్టారర్ మిస్ అయ్యామే..!

తెలుగులో కూడా సూర్య పాత్రకు పవన్ కళ్యాణ్, మాధవన్ పాత్రకు రవితేజను తీసుకోవాలని అనుకున్నారు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 3:45 AM GMT
పవర్ మాస్ మల్టీస్టారర్ మిస్ అయ్యామే..!
X

సోలోగా అదరగొట్టే స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది. అఫ్కోర్స్ అలా చేయడం వల్ల మా హీరోకి గొప్ప అంటే మా హీరో గొప్ప అనే ఫైట్ ఫ్యాన్స్ మధ్య కామనే కానీ అలా కలిసి కొన్ని కథలు తెర మీద చెబితే చాలా బాగుంటుంది. మన దగ్గర నిన్నటితరం తారలు అలా చేయలేకపోయారు. ఇప్పుడిప్పుడే మన స్టార్స్ కాస్త మల్టీస్టారర్ వైపు అడుగులు వేస్తున్నారు. ఐతే సౌత్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటిన డైరెక్టర్ మణిరత్నం తెలుగు స్టార్స్ తో ఒక మల్టీస్టారర్ చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రయత్నాన్ని కాదనుకున్నారు.

ఇంతకీ మణిరత్నం చేయాలనుకున్న సినిమా ఏది.. ఆయన తీయాలనుకున్న మల్టీస్టారర్ హీరోలు ఎవరు అంటే ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాగా.. మరొకరు మాస్ మహరాజ్ రవితేజ. ఐతే ఇది ఇప్పుడు కాదు దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన యువ సినిమా వెనక స్టోరీ. యువ అంటూ సూర్య, మాధవన్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు మణిరత్నం. ఆల్రెడీ హిందీలో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, వివేక్ ఓబెరాయ్ లతో తీశారు.

తెలుగులో కూడా సూర్య పాత్రకు పవన్ కళ్యాణ్, మాధవన్ పాత్రకు రవితేజను తీసుకోవాలని అనుకున్నారు. హీరోలిద్దరు కూడా కథ విని దాదాపు ఓకే చెప్పారట. మణిరత్నం సినిమాలో ఛాన్స్ అంటే అటు పవన్ కానీ ఇటు రవితేజ కానీ నో చెప్పే ఛాన్స్ లేదు. ఐతే మధ్యలో ఏమైందో ఏమో కానీ మళ్లీ తమిళ వెర్షన్ నే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగు యువ సినిమా అసలైతే పవన్, రవితేజలతో చేయాల్సింది కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.

ఏది ఏమైనా ఆ సినిమా తెలుగులో రీమేక్ చేసి ఉంటే కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉండేది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహరాజ్ రవితేజ ఇద్దరికి హ్యూజ్ మాస్ ఫాలోయింగ్ ఉంది. అందులోనూ వారికి యూత్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందుకే యువ లాంటి సినిమా ఈ ఇద్దరికి పడి ఉంటే కచ్చితంగా సినిమా సక్సెస్ అందుకునేది. ఐతే ఆ తర్వాత కూడా మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాను మహేష్, విజయ్ లతో చేయాలని అనుకున్నారు కానీ కుదరలేదు.