Begin typing your search above and press return to search.

పవన్ డైరెక్షన్.. ముందే గెస్ చేశారా?

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన రమణ గోగుల మ్యూజిక్ అందించారు.

By:  Tupaki Desk   |   6 Feb 2025 9:50 AM GMT
పవన్ డైరెక్షన్.. ముందే గెస్ చేశారా?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. నటించిన జానీ మూవీ గురించి అందరికీ తెలిసిందే. పవన్ స్వీయ దర్శకత్వం వహించిన ఆ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన రమణ గోగుల మ్యూజిక్ అందించారు. దీంతో అంతా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అదే సమయంలో బ్లాక్ బస్టర్ హిట్ ఖుషీ తర్వాత పవన్ యాక్ట్ చేస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా జానీ హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. కొత్త రికార్డులు సృష్టిస్తుందని అంచనా వేశారు. అయితే ఫ్యాన్స్ ఇప్పటికీ ఆ సినిమా కల్ట్ గా భావిస్తారు. కానీ జానీ మూవీ మాత్రం డిజాస్టర్ అయ్యింది. దారుణంగా నిరాశపరిచింది.

2003లో జానీ మూవీ థియేటర్లలో రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత అల్లు అరవింద్ జానీ మూవీ రిజల్ట్ గురించి మాట్లాడారు. ఇదేం తొలిసారి అని చెప్పడం లేదు గానీ.. నార్మల్ గా తండేల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. జానీ ఫలితం తనకు ఇప్పటికీ షాకింగ్ గానే ఉంటుందని తెలిపారు.

అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు.. జానీ మూవీ అలాంటి రిజల్ట్ అందుకోవడం ఊహించలేనిదని చెప్పారు. ముఖ్యంగా తన ఇమేజ్ దాటి ప్రయోగం చేయడాన్ని అభిమానులు.. యాక్సెప్ట్ చేయలేదని అన్నారు. అదే సమయంలో షూటింగ్ టైమ్ లో పవన్ కు ఓ సారి రిజల్ట్ పై అనుమానం వచ్చిందని తెలిపారు అల్లు అరవింద్.

కానీ ఇప్పుడు ప్రాజెక్టు వెనక్కి వెళ్లి పరిస్థితి లేకపోవడం వల్ల కంటిన్యూ చేశామని చెప్పిన ఆయన.. తాము భయపడినట్లే సినిమా ఫ్లాప్ అయిపోయిందని చెప్పారు. ప్రస్తుతం అల్లు అరవింద్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన వ్యాఖ్యల బట్టి.. ముందే పవన్ కు జానీ మూవీ రిజల్ట్ పై క్లారిటీ వచ్చేసిందేమో!

అయితే జానీ పెద్ద ఎక్సపరిమెంటేనని చెప్పాలి. టాలీవుడ్ కు అంతగా పరిచయం లేదని బాక్సింగ్ నేపథ్యంలో మూవీ వచ్చింది. పవన్ గా డైరెక్టర్ మంచి అనుభూతి అందించినా.. హీరో పెద్ద ఎక్స్ పెరిమెంట్ చేసినా... సినిమాలో మిగతా విషయాలు ఆడియన్స్ కు నచ్చలేదు.. పెద్దగా ఎక్కలేదు. దీంతో మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.