Begin typing your search above and press return to search.

OG సర్ ప్రైజ్: అలాంటోడితో డబుల్ బ్లాస్ట్

ఈ సినిమా ఫ్యాన్స్‌లో ఏ రేంజ్‌ లో ఆసక్తిని రేపుతుందో గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే స్పష్టమైంది.

By:  Tupaki Desk   |   9 Jan 2025 8:11 AM GMT
OG సర్ ప్రైజ్: అలాంటోడితో డబుల్ బ్లాస్ట్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడో పూర్తి కావాల్సిన షూటింగ్ పవన్ పాలిటిక్స్ కారణంగా ఆలస్యం అయ్యింది. ఇక షూటింగ్ అయితే చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా ఫ్యాన్స్‌లో ఏ రేంజ్‌ లో ఆసక్తిని రేపుతుందో గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే స్పష్టమైంది. ఇంకా 15 రోజుల షూటింగ్ వర్క్ మాత్రమే మిగిలి ఉండటంతో, ప్రొడక్షన్ టీమ్ త్వరలోనే పవన్ కళ్యాణ్‌ని కలుసుకుని మిగతా షెడ్యూల్‌ కోసం డేట్స్ ఖరారు చేయనుంది.

సంక్రాంతి పండగ తరువాత పవన్ షూటింగ్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. జూలైలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా, కళకత్తా బ్యాక్‌డ్రాప్‌లో సుజిత్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఓజీ టీజర్ సంక్రాంతి కానుకగా విడుదల కానుందనే ప్రచారం ఇప్పటికే మొదలైంది. 1:39 నిమిషాల నిడివి గల ఈ టీజర్‌తో, సినిమా రేంజ్‌పై స్పష్టత రావచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఓజీ క్యారెక్టర్ తో డబుల్ బ్లాస్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పార్ట్ 2పై కూడా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. "అలాంటోడు మళ్ళీ వస్తున్నాడు అంటే.." ఈ లైన్ తోనే సినిమాకు కావాల్సినంత హైప్ ఎక్కించారు. ఇక అలాంటి పాత్రకు మరో కొత్త మెరుగులు అద్దేలా కథను ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం.

అయితే, ఈ ప్రాజెక్ట్‌కి పవన్ కళ్యాణ్‌ అంగీకారం అవసరమని తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడ మంగళగిరి పరిసరాల్లో ఆరు ఎకరాల స్థలంలో భారీ సెట్‌లను నిర్మించేందుకు ప్రొడక్షన్ టీమ్ పని చేస్తోంది. పార్ట్ 2కు అవసరమయ్యే కీలక సన్నివేశాల కోసం ఈ సెట్‌లను ఉపయోగించనున్నారు. మేకర్స్ సంక్రాంతి తర్వాత ఓజీ పార్ట్ 1 పనులు పూర్తిచేసి, విడుదల ప్రక్రియపై దృష్టి పెట్టాలని చూస్తున్నారు.

మొదటి భాగం విజయం సాధిస్తే, పార్ట్ 2కి మరింత భారీ స్థాయిలో నిర్మాణం ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫ్యాన్స్‌ మాత్రం పార్ట్ 2 పై వచ్చే అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి అలాంటోడు పాత్ర పవన్ అభిమానులకు చాలా ప్రత్యేకం కావడంతో, పార్ట్ 2 మరింత మాస్ అప్పీల్‌తో ఉండబోతోందని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా లైనప్ లో ఉన్న సినిమాలను వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు.